
ఆగస్టులో 150వ సినిమా
సినీనటుడు, ఎంపీ చిరంజీవి వెల్లడి
రైల్వేకోడూరు: ఆగస్టులో తన 150వ సినిమా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీనటుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో శనివారం ఆయన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిమానులు 150వ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇక ఆలస్యం చేయనని, ఆగస్టు నెలలో సినిమా ప్రక్రియ మొదలుపెడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండలి విపక్షనేత రామచంద్రయ్య, మాజీ ఎంపీలు గునిపాటి రామయ్య, సాయిప్రతాప్, ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, టీడీడీ బోర్డు సభ్యుడు హరిప్రసాద్, మాజీ మంత్రి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.