రైల్వేకోడూరు: తన భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇప్పించాలని రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించిన అధికారులు పట్టించుకోలేదని మనస్తాపం చెందిన వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబులపల్లి గ్రామానికి చెందిన రైతు కత్తిరత్తయ్య(48) పూర్వికులకు చెందిన భూమి నుంచి గ్రామ అవసరాల కోసం బాటను కేటాయించారు.
మిగతా భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇప్పించాల్సిందిగా కోరుతూ.. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెంది గురువారంగ్రామంలోని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. ప్రస్తుతం అతనితో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చర్చలు జరుపుతున్నారు.