కర్నూలు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘావరాజపురం గ్రామ శివారులో జరిగింది. వివరాలు.. రైల్వేకోడూరు పంచాయతి కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ (30) అనంతరాజుపేట గ్రామంలోని తన స్నేహితుని ఇంటి నుంచి బైక్‌పై వస్తుండగ రాఘావరాజపురం గ్రామ సబ్‌స్టేషన్ ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.