వైఎస్సార్ జిల్లా: రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన మల్లు మల్లికార్జునరెడ్డి(23) ఈ నెల 10వ తేదీన మదనపల్లె సమీపంలో ఆర్టీసు బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు.
బెంగుళూరుకు తరలించగా అక్కడ ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మృతుడు మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేశారని, సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈయనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 10 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు సమాచారం.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
Published Wed, May 18 2016 9:35 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
Advertisement
Advertisement