mallikarjun reddy
-
‘గుట్టలు గుల్ల’కు ఇక చెల్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వడాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో స్థానికులు, బీజేపీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా బట్టాపూర్లో గుట్టలను తొలిచేయడంపై గతేడాది ’సాక్షి’ప్రదాన సంచికలో ‘గుట్టలు గుల్ల’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి హైకోర్టులో ‘పిల్’దాఖలు చేశారు. దీనిపై గత నెల 16న ‘బట్టాపూర్ గుట్ట మింగివేతపై పిల్’అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్’(ఎల్రక్టానిక్ టోటల్ సర్వే) గుట్టలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో క్వారీ, క్రషర్‌ను సీజ్ చేయాలని చెప్పిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 13 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, మోర్తాడ్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీంగల్ మండలాల్లో ఫ్లెక్సీలు కట్టారు. గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను వాటిపై ముద్రించారు. మరోపక్క గురువారం బట్టాపూర్ గుట్ట వద్ద బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. -
డిసెంబర్ 6న వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: కరోనా వేవ్‌ల వల్ల ఆర్టీసీ రూ.5,680 కోట్ల మేర నష్టపోయిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పడిందని తెలిపారు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం వాటిల్లిందని.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రోజుకు రూ.320 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని అప్పుల బారి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మల్లికార్డునరెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఈడీ చింతా రవికుమార్, కోనసీమ డీపీటీవో ఆర్వీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆర్టీసీ’ పెట్రోల్ బంకులు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా.. ఆర్టీసీకి మేలు జరుగుతుందన్నారు. సోమవారం కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంతీయ ఆస్పత్రి, ఆర్ఎం కార్యాలయం, ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ, ఆర్టీసీ వర్క్‌షాప్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ద్వారా 20 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 11 బంకులకు ఎన్ఓసీ మంజూరైందని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఆర్టీసీకి విలువైన స్థలాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆర్టీసీ ప్రాంతీయ ఆస్పత్రులు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. కడపలోని కార్మికులకు కూడా మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆస్పత్రిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీ కార్గో సేవలను తక్కువ ధరకు అందిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ, కడప రీజియన్ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి, చైర్మన్ ఓఎస్డీ గోపి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘కమలం’వీడి.. కారెక్కి
ఆదిలాబాద్ / నిర్మల్: ఎన్నికల ముందే బీజేపీకి గట్టి షాక్ తగిలింది. నిర్మల్ నియోజకవర్గంలో అసంతృప్త వర్గం కారెక్కింది. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఇటీవల టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖ వైద్యుడు మల్లికార్జున్‌రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ పట్టణాధ్యక్షుడు, వివిధ మండలాల, వివిధ మోర్చల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడా రు. దీంతో నియోజకవర్గంలో కమలదళం దాదా పు ఖాళీ అయ్యింది. వీరంతా సోమవారం రాత్రి టీ ఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఊహించని పరిణామం.. సిద్ధాంతపార్టీగా గుర్తింపు ఉన్న భారతీయ జనతాపార్టీలో నుంచి ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు దూరం కావడం ఊహించని పరిణామంగా వివిధ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పటికీ వారు పార్టీతోనే కలిసి వస్తారనే అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు పార్టీని కాదని, వ్యక్తిని నమ్ముకుని చాలామంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వెళ్లడంపై బీజేపీ నాయకత్వం ఆలోచనలో పడింది. ఏడాదిన్నర క్రితం పార్టీలో చేరిన ప్రముఖ వైద్యుడు మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకూ ఆయనే అభ్యర్థిగా పార్టీ నాయకులూ గుర్తించారు. మల్లికార్జున్‌రెడ్డి సైతం అప్పటికే ప్రచారం ప్రారంభించారు. అనంతరం నెలన్నర కిందట డాక్టర్ సువర్ణరెడ్డి పార్టీలో చేరడంతో పోటీ మొదలైంది. వారిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. మల్లికార్జున్‌రెడ్డి చివరి వరకూ పోటీ పడ్డారు. తన అభ్యర్థిత్వం కోసం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేశారు. చివరకు ఈనెల 2న బీజేపీ రెండో జాబితాలో సువర్ణరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. పార్టీ మల్లికార్జున్‌రెడ్డికి మొండిచేయి చూపడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అసంతృప్తిలోనే.. ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న తనకు అన్యాయం చేశారని, తన అనుచరులుగా ఉంటున్న కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని రాజీనామా చేసిన తర్వాత డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ఈనెల 2న బీజేపీ రెండో జాబితాలో మల్లికార్జున్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన వెంట ఉన్న జూనియర్ నాయకులంతా నిరాశకు లోనయ్యారు. అదేరోజు రాత్రి నిర్మల్‌లోని మయూరిఇన్ హోటల్లో వారంతా సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారం తెలుసుకుని సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ తదితరులు అక్కడికి వచ్చారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేయాలని వారు సూచించారు. కానీ.. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారంటూ అసంతృప్తవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. తర్జనభర్జనల నడుమ.. బీజేపీ నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా సువర్ణరెడ్డి పేరు ఖరారు కావడంతోనే మల్లికార్జున్‌రెడ్డి వర్గం నాలుగైదు రోజులుగా చర్చలు జరిపింది. తమ భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు చేసింది. ఈక్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులు, అభ్యర్థి సువర్ణరెడ్డి సైతం మల్లికార్జున్‌రెడ్డి, ఇతర నాయకులను కలిశారు. పార్టీ గెలుపు కోసం సహకరించాలని వారిని కోరారు. బీజేపీలో అసంతృప్త వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరి వరకూ అసంతృప్తవర్గం బీజేపీలో ఉండటానికి మొగ్గు చూపింది. ఇన్నిరోజులు పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం చేయాలన్న ధోరణిని వ్యక్తంచేసింది. దీనిపై నాలుగైదు రోజులైనా పార్టీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడం, తమ పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్లో చేరిక.. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మల్లికార్జున్‌రెడ్డి వర్గం టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మల్లికార్జున్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అనంతరం అల్లోల స్వయంగా మల్లికార్జున్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయనతోపాటు వర్గీయులనూ తన ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం వారందరికీ గులాబీ కండువాలను వేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మల్లికార్జున్‌రెడ్డితో పాటు బీజేపీ నిర్మల్ పట్టణాధ్యక్షుడు నాయిడి మురళీధర్, జిల్లా కార్యదర్శి బర్కుంట నరేందర్, నిర్మల్ రూరల్ మండలాధ్యక్షుడు గరిగంటి గంగాధర్, మైస శేఖర్(సారంగపూర్), డాక్టర్ నరేశ్(సోన్), కొడిచెర్ల లింగన్న(మామడ) సతీష్(నర్సాపూర్.జి), పీసరి శైలేశ్వర్(దిలావర్పూర్), భరత్‌నారాయణ(లక్ష్మణచాంద), బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు నాంపెల్లి శశిరాజ్‌వర్మ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల సతీశ్, అసెంబ్లీ కన్వీనర్ అన్ముల శ్రావణ్ తదితర బాధ్యతలు ఉన్న నాయకులు, నియోజకవర్గంలోని బీజేపీ అధ్యక్షులు కారు పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు డాక్టర్ యు. సుభాష్‌రావు, గంగారెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, జహీర్, పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మారుగొండ రాము తదితరులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
వైఎస్సార్ జిల్లా: రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన మల్లు మల్లికార్జునరెడ్డి(23) ఈ నెల 10వ తేదీన మదనపల్లె సమీపంలో ఆర్టీసు బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు. బెంగుళూరుకు తరలించగా అక్కడ ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మృతుడు మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేశారని, సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈయనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 10 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు సమాచారం. -
నిత్యతో సత్య రొమాన్స్
‘‘ప్రేమకథలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. వెండితెరపై ప్రేమను కొత్తగా ఆవిష్కరిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ ‘నిత్య విత్ సత్య’ కూడా సరికొత్త ప్రేమకథా చిత్రం’’ అంటున్నారు దర్శకుడు నాగేంద్రప్రసాద్. మనీష్, తేజస్విని జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘నిత్య విత్ సత్య’. భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై జి. మల్లికార్జున్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇంతకు ముందు మా దర్శకుడు ‘కీ’ తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. యువతరం కోరుకునే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నిత్య అనే అమ్మాయితో సత్య అనే అబ్బాయి రొమాన్స్ ఎన్ని రకాలుగా మలుపు తిరిగిందనేది తెరపై ఆసక్తికరంగా చిత్రీకరించారు. ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ ఇందులో కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్, కెమెరా: కల్యాణ్ సమీ. -
పుష్ప సోయగం..మల్లన్న వైభవం
శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లు పుష్పపల్లకిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి వివిధ రకాలైన పూలను వినియోగించారు. సుదూర ప్రాంతాల నుంచి తెప్పించిన 650 రకాల పూలతో పాటు 4,500 విడి పుష్పాలను ఈ సేవ కోసం వినియోగించారు. ఇందులో భాగంగా తెల్ల, పసుపు చేమంతి, ఎర్ర, పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, అర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్రోజ్, స్టార్రోజ్, ఆస్ట్రిస్ మొదలైన 16 రకాల పుష్పాలు అలంకరణకు ఉపయోగించారు. పుష్పపల్లకి అంకాలమ్మ గుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లకు నారికేళ ఫలాదులను సమర్పించి కర్పూర నీరాజనాలను అర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రమేష్, ఏఈఓ రాజశేఖర్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు, మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, వివిధ విభాగాల అధికార సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. నేడు పూర్ణాహుతి .. శ్రీశైలమహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం ప్రాతఃకాలపూజల అనంతరం 9.40 గంటలకు శ్రీ స్వామివార్ల యాగశాలలో రుద్రహోమ పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తరువాత కలశోధ్వాసన, వసంతోత్సవం, అవబృధం, త్రిశూల తీర్థోత్సవం జరిపిస్తారు. అదేరోజు రాత్రి 7గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.