రైల్వేకోడూరు: వైఎస్సార్‌జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే కోడూరులోని టోల్గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వేగంగా వస్తున్న లారీ ఆటోని ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శెట్టిగుంట గ్రామానికి చెందిన గొండ వెంకటయ్య(45) అరుణమ్మ(35) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.