రైల్వే కోడూరు(వైఎస్సార్ జిల్లా): పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని మలంపాలెం గిరిజన కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నరాన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పదిమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 30,780 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.