రైల్వే కోడూరు రూరల్ (వైఎస్సార్‌జిల్లా) : పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లి.. అక్కడి అవమానాలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌జిల్లా వాసి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. జిల్లాలోని రైల్వేకోడూరు మండలం గంగరాజుపురం గ్రామానికి చెందిన దక్షిరాజు సుబ్రహ్మణ్య రాజు అలియాస్ ముణిరాజు(38) అనే వ్యక్తి పొట్టకూటి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ షేక్ ఇంట్లో పనికి కుదిరాడు.
అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. కానీ దీనికి షేక్ అనుమతించకపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 21వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉంటున్న వాళ్ల బంధువుల సహకారంతో వారం రోజుల తర్వాత గురువారం సాయంత్రం ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతునికి భార్య లీలావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్వగ్రామానికి చేరిన కడప వాసి మృతదేహం
Published Thu, Aug 27 2015 7:12 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement