రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో ఓ టీడీపీ నేత ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్నాయుడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. రైల్వేకోడూరు, తిరుపతిలోని ఇళ్లు, ఆయన కార్యాలయాలతో పాటు టీడీపీ కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి.