రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను, పంటలను పరిశీలించడానికి కేంద్రం నుంచి వచ్చిన వరద అంచనా బృందం గురువారం రైల్వేకోడూరుకు చేరుకుంది. ఎండీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. ఈ బృందంలో నలుగురు సభ్యులున్నారు. రైతులను, స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు.