వాన.. వరదలా
ఏలూరులో 80 మిల్లీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 70.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు, భీమవరం, ఉండి ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపాడు. పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం తదితర ప్రాంతాల్లో విస్తారంగా
వర్షాలు కురిశాయి. పాలకొల్లు, దెందులూరు, తణుకు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.