కేసీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. బొజ్జవారిపల్లె సమీపంలోని పైలాన్ వద్ద మహిళ మృతదేహం ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రొద్దుటూరు క్రైం: కేసీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. బొజ్జవారిపల్లె సమీపంలోని పైలాన్ వద్ద మహిళ మృతదేహం ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ జిఎండి.బాషా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెకు 40 ఏళ్లు దాకా ఉంటాయని తెలిపారు. ఈమెకు సంబంధించిన బంధువులు రూరల్ పోలీసులకు సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.