శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న దృశ్యం(ఫైల్)
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Published Mon, Sep 26 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– ఉదయం 6 నుండి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నేటి మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు.
Advertisement
Advertisement