koil allavar tirumanjan
-
వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 18 న ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేసి.. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించి.. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీవారి సన్నిధిలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 29న వైకుంఠం ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఈ వైదిక కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేసి.. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించి.. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. 29న వైకుంఠ ఏకాదశి పూజలు ఈనెల 29వ తేది వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు అర్థరాత్రి 12.01 నుండి 5 గంటలవరకు ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావైతో మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిసేకం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు దర్శనమివ్వనున్నారు. 30న తీర్థ ముక్కోటి.. పుష్కరిణిలో చక్రస్నానం ఈనెల 30వ తేదిన వైకుంఠ ద్వాదశి సందర్భంగా తీర్థ ముక్కోటి ఉత్సవం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారు పుష్కరిణి వద్ద అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, చక్రస్నానం చేస్తారు. -
26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26వ తేది మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమలమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈనెల 26వ తేది వైకుంఠ ఏకాదశిసందర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారంæ ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తారు. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయంవరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేస్తారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 29న వైకుంఠ ఏకాదశి పూజలు ఈనెల 29వ తేది వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ›ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆరోజు అర్థరాత్రి 12.01 నుండి 5 గంటలవరకు ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావైతో మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిసేకం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు దర్శనమివ్వనున్నారు. 30న తీర్థ ముక్కోటి.. పుష్కరిణిలో చక్రస్నానం ఈనెల 30వ తేదిన వైకుంఠ ద్వాదశి సందర్భంగా తీర్థ ముక్కోటి ఉత్సవం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారు పుష్కరిణి వద్ద అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, చక్రస్నానం చేస్తారు. -
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– ఉదయం 6 నుండి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నేటి మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు.