ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ | lorry hits mlc car | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ

Published Tue, Feb 21 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ

ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ

తాడేపల్లిగూడెం రూరల్‌ :  ఇన్నోవా కారును లారీ ఢీకొన్న ఘటన మండలంలోని నవాబ్‌పాలెం కొత్త బ్రిడ్జిపై మంగళవారం చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కారు(ఏపీ 05 డీఏ 555)ను నవాబ్‌పాలెం కొత్త బ్రిడ్జిపై కూల్‌డ్రింక్స్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయింది. అయితే కారులోని వారు క్షేమంగా బయటపడ్డారు. కారు డ్రైవర్‌ కడియాల తారక రామారావు ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement