హాకీ జిల్లా జట్లు ఎంపిక
హాకీ జిల్లా జట్లు ఎంపిక
Published Tue, Sep 13 2016 6:13 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
భీమవరం టౌన్ : వచ్చేనెల 7 నుంచి 10వ తేదీ వరకూ నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా సబ్ జూనియర్ బాలుర టీమ్‌ను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 110 మంది క్రీడాకారులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. అలాగే అనంతపురం జిల్లా ఆర్‌డీటీ గ్రౌండ్‌లో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ జరిగే సబ్ జూనియర్ బాలికల, జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే పశ్చిమ టీమ్‌లను ఎంపిక చేశారు. 80 మంది క్రీడాకారిణులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. సెయింట్ మేరీస్ హెచ్‌ఎం సిస్టర్ వలసమ్మ జార్జి ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌ను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్ ఎంపిక చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పి.దుర్గారావు, డీజెఆర్‌ఎల్ శేఖర్‌బాబు, కె.జేమ్స్, నాయుడు పాల్గొన్నారు.
సబ్ జూనియర్‌బాలుర టీమ్
జి.యశ్వంత్ గణేష్, బి.దుర్గ ప్రసాద్, వి.భరత్‌కుమార్, పి.పవన్ కళ్యాణ్, పి.జేజే సాయి శ్రీకర్, కె.సందీప్, కె.జయరాం విష్ణు, ఎన్.కమల్ యువన్(భీమవరం సెయింట్ మేరీస్), బి.సాయి సత్యం నాయుడు (భీమవరం), డి.రాజేష్ (శృంగవృక్షం జెడ్పీ), జె.సూరిబాబు(కృష్ణయ్యపాలెం జెడ్పీ), డి.విజయ్‌కుమార్ (కాకరపర్రు జెడ్పీ), సీహెచ్ నారాయణ శేషు, జి.శ్యామ్‌స్టీవ్, కె.జోయల్, ఎండీ అసానుద్దీన్ (సెయింట్ మేరీస్ భీమవరం), పి.సారా మణికంఠ(కాకరపర్రు జెడ్పీ), కె.సందీప్ రాజా(భీమవరం), ఫస్ట్ స్టాండ్‌బై ్రMీ డాకారులుగా ఎన్.ఎడ్వర్డ్, సాయి శ్రీరాం(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు.
సబ్ జూనియర్ బాలికల టీమ్
కె.జయాచౌదరి, కె.సంజన, ఎ.రిషిక లక్ష్మి, పి.చార్మిత, టి.భాను సాయిశ్రీ (సెయింట్ మేరీస్ భీమవరం), ఎన్.నళినాక్షి, బి.అర్జు (బీవీబీ టీపీగూడెం), టి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.అశ్రిత (సెయింట్ మేరీస్ భీమవరం), పి.మౌనిక (కాకరపర్రు జెడ్పీ), పి.అంబిక (కృష్ణయ్యపాలెం జెడ్పీ), ఫస్ట్‌స్టాండ్‌బైగా కె.వర్ష(సెయింట్ మేరీస్ భీమవరం), పి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.చాతుర్య(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు.
జూనియర్ బాలికల టీమ్
ఎ.ధరణి, ఎ.రిషిత, కె.రమ్య నాగలక్ష్మి (నారాయణకాలేజి భీమవరం), కె.శృతి (భీమవరం), కె.భరణి (పెనుగొండ), పి.మౌనిక, కె.శారద (టీపీ గూడెం), ఎ.మాధురి (కృష్ణయ్యపాలెం).
Advertisement