
వై.కోట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం
వైకోట(ఓబులవారిపల్లె): మండల శివారుగ్రామమైన వై.కోట అటవీ ప్రాంతంలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో చాలా రోజుల క్రితమే మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఓబులవారిపల్లె ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు తమ సిబ్బందితో అటవీ ప్రాంతంలో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి నడుముకు ఉన్న మొలతాడు ఆనవాళ్లనుబట్టి యానాది తెగకు చెందినవాడై ఉంటాడని స్థానికులు అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.