ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్): మండలంలోని జగన్నాథపురం హజరత్ కాలే మస్తాన్ షాఔలియా దర్గాలో మంగళవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి దర్గాలో ప్రత్యేక నమాజ్‌లు, భక్తి పాటలు ఆలపించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి, ఆమె కుమారుడు అబ్బిన రాజీవ్ చౌదరి నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు బొల్లిన రామకృష్ణ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుల మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం చందల్ ఊరేగింపు జరుగుతుందని దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి తెలిపారు.