darga
-
సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పర్వతగిరి: సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నారంషరీఫ్‌లోని హజ్రత్‌సయ్యద్ యాకూబ్‌షావలీ దర్గాలో మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వేర్వేరుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని, ఈ పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంచారని వివరించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 36 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్ పాల్గొన్నారు. పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక శోభ తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కల్లెడ, బూర్గుమల్ల గ్రామాల మధ్య స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఆలయానికి కర్నాటకకు చెందిన మనోజ్‌రావు రూ.10 లక్షల విరాళం అందించనున్నట్లు ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రతన్‌రావు, ఏకాంతంగౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, బూర్గుమల్ల సర్పంచ్ ఏడుదొడ్ల ఇందిరాజితేందర్‌రెడ్డి, కల్లెడ సర్పంచ్ కొంపెల్లి శోభాపరమేశ్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సమత.. మమత
దర్గా విశిష్టత :కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి మత ప్రబోధనలు చేస్తూ వచ్చిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి 1916లో కమలాపురానికి వచ్చి స్థిర పడ్డారు. ఆయన తన భక్తులకు బోధనలు చేస్తూ ఎన్నో మహిమలు చూపారు. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనకు శిష్యులుగా మారారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణులై విరాజిల్లుతున్న గఫార్ షా ఖాద్రి తన ప్రియ శిష్యుడైన దస్తగిర్‌షా ఖాద్రికి గురుత్వం బోధించి 1924 జనవరి 10న సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దస్తగిర్‌షా ఖాద్రి వంశీయులే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా పీఠాధిపతిగా కొనసాగిన హజరత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఫైజుల్ గఫార్‌షా ఖాద్రి గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కమలాపురం :కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా మత సామరస్యానికి ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి, శ్రీ హజరత్ దస్తగిర్షాఖాద్రి, శ్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి , శ్రీ హజరత్ జహీరుద్దీన్ షాఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్లు వెలసి ఉన్నారు. ప్రతి ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం గత 50 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. స్వర్గీయ పీఠాధిపతి హజరత్ హాజి జహీరుద్దీన్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆయన పరమ పదించిన తర్వాత ఆయన వారసులు, ప్రస్తుత పీఠాధిపతి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 30వ తేదీన నషాన్‌తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 31న గంధం, ఏప్రిల్ 1న ఉరుసు, 2న తహలిల్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం గఫారియా ట్రస్ట్ అధ్యక్షుడు జియా ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1న బండ లాగుడు పోటీలు:ఏప్రిల్ 1వ తేదీన దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించ నున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రు.25,116, ద్వితీయ బహుమతి రు.10వేలు, తృతీయ బహుమతి రు.7వేలు, నాల్గవ బహుమతి రు.5వేలు ఇవ్వనున్నారు. అన్నదానం:ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నషాన్ రోజున టి. హుసేన్ మియ్య, గంధం, ఉరుసు రోజుల్లో మోహన్ బీడీ యజమాని మహబూబ్ సాహెబ్, తహలిల్ రోజున ముంబాయి ఖాదర్ వారు అన్నదానం చేయనున్నారు. మతసామరస్యానికి ప్రతీక హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిర్రిషా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్ఠి ధర్మకర్తగా కొనసాగారు. ఇప్పటికి నాగయ్య కుమారులే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. గొప్ప ఖవ్వాలి ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించ నున్నారు. ప్రముఖ ఖవ్వాల్లు యూపీకి చెందిన సర్ఫరాజ్ చిష్టి, రాజస్థాన్‌కు చెందిన దిల్షాద్ ఇర్షాద్ సాబిరి ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుంది. -
మత సామరస్యం వెల్లివిరిసె..
అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాతరల్లో రంగాపూర్ ఒకటి. మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద రెండో ఉర్సు నిరంజన్ షావలీ. ఈ నెల 17న రాత్రి నుం చి వారం రోజుల పాటు వైభవంగా జరుగుతా యి. అచ్చంపేట మండలం రంగాపూర్‌లో జరిగే ఉర్సుకు నల్లమల ప్రజలకు ప్రత్యేక సంబరాలు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఉర్సుకు జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా లక్షన్నర మందికిపైగా భక్తులు పాల్గొంటారు. భక్తులు కందూరు చేసి మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. ఉర్సు రంగాపూర్గా పిలవబడుతున్న ఈ దర్గా వద్ద భక్తులు ఉత్సవాల సమయంలోనే కాక వివిధ రోజుల్లో దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్రాబాద్ మండలం ప్రజలు ఏ శుభకార్యం చేసినా మొదట కొండపై ఉన్న దర్గాను దర్శించుకుని తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దర్గా చరిత్ర 600ల ఏళ్ల క్రితం ఆరబ్దేశాల నుంచి అజ్మీర్‌లో స్థిరపడిన హజ్రత్ ఖాజాగరీబ్ నవాస్, ఢిల్లీలో స్థిరపడిన నిజామోద్దీన్ ఔలియా శిఘ్యలు ఇస్లాం మత ప్రచారంలో భాగంగా కాలినడకన తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. వారిలో ఐదుగురు ప్రముఖులు ఉన్నారు. అందులో హజ్రత్ నిరంజన్‌షావలీ(సయ్యద్ మహమూద్షాఖాద్రి) రంగాపూర్లోను, మరొకరు కొండపై హజ్రత్ బహావోద్దీన్షాఖాద్రిగా స్ధిరపడ్డారు. అలాగే నల్లగొండ జిల్లా జాన్పాడ్ సైదులుగా మరొకరు కొత్తూరు ఇన్ముల్ నర్వ వద్ద జేపీ పీర్లుగా, నిజామాబాద్‌లోని షాహదుల్లా హుస్సేన్, భువనగిరి జమాల్బహాద్లనే పేర్లతో స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెప్పుకుంటున్నారు. ఇస్లాం మత ప్రచార నిమిత్తం నల్లమల ప్రాంతానికి వచ్చిన నిరంజన్‌షావలీ రంగాపూర్‌లో, మన్ననూర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బహావోద్దీన్షా కొండ మూల మలుపు వద్ద స్థిరపడ్డారు. వారి మరణాంతరం అక్కడ దర్గాను నిర్మించారు. అ కాలం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతవాసులు దర్గాలో ఉర్సు నిర్వహిస్తున్నారు. గంధోత్సవం అచ్చంపేటలోని నారాయణప్రసాద్ ఇంటి నుంచి గంధాన్ని తీసుకెళ్లడం అనవాయితీ. 17న రాత్రి అచ్చంపేట మహబుబ్స్వామి దర్గాతో పాటు మన్ననూర్, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, బొమ్మనపల్లి, పెనిమిళ్ల, నాగర్‌కర్నూల్, తెల్కపల్లి, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. బొమ్మనపల్లి నుంచి గంధాన్ని గుర్రంపై తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గ్రామాల నుంచి బయలుదేరిన గంధోత్సవాలు అర్ధరాత్రి వరకు రంగాపూర్‌కు చేరుకుంటాయి. అన్ని ప్రాంతాల నుంచి గంధోత్సవాలు చేరుకోగానే భక్తులు నత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజునుంచి ఉర్సు కొనసాగుతుంది. ఉమామహేశ్వర క్షేత్ర సందర్శన రంగాపూర్‌కు 5కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్గా దర్శనం అనంతరం భక్తులు సందర్శించడం అనవాయితీ. ఉర్సుకు మూడు రోజుల ముందే ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉర్సుకు వచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మత సామరస్యానికి దర్పణం పట్టే ఈ రెండు ఉత్సవాలు ఒకేసారి ముగుస్తాయి. ప్రత్యేక బస్సులు రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్ వరకు 25ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్– ఉమామహేశ్వర కొండపైకి ఆరు మినీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్–అచ్చంపేట, నాగర్‌కర్నూల్–అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్–అచ్చంపేటకు బస్సులు నడిపిస్తున్నట్లు డీఎం నారాయణ తెలిపారు. -
అర్ధరాత్రి దర్గా కూల్చివేత
మైదుకూరు టౌన్ : ప్రజల మనోభావాలు దెబ్బతినే రీతిలో అర్ధరాత్రి సమయంలో దర్గా కూల్చివేత తగదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. 200 ఏళ్లనాటి దస్తగిరి స్వామి దర్గాను బుధవారం అర్ధరాత్రి కూల్చివేయడంలో రెవెన్యూ అధికారులు ఇష్టాను సారంగా వ్యవహరించారని ఎమ్మెల్యే మండిపడ్డాడు. రోడ్డుకు అడ్డంగా ఉంటే ప్రజలకు తెలియజేసి వివరించాలేకానీ ఇళ్లలోనుంచి ప్రజలను బయటకు రాకుండా విద్యుత్ దీపాలను అర్పి చీకటిలో తొలగించడం సిగ్గుచేటన్నారు. ఒక పెద్ద వేపచెట్టును ఎలాంటి ఆనవాళ్లు లేకుండా రాత్రికిరాత్రి రెండు జీసీబీలతో తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఆర్అండ్బీ అధికారులతో దర్గా విషయంపై చర్చించామని, కాస్త రోడ్డుకు లోపలి భాగంలో కట్టుకుంటామని తెలిపితే సరేనన్న అధికారులు అర్ధాంతరంగా ఇలా ఎందుకు చేశారో సమాధానం చెప్పాలన్నారు. దర్గా సమీపంలోని వీధిలో ముస్లిం ప్రజలను ఇంటిలో పెట్టి బయట పోలీసులను కాపలా ఉంచడం అసలు ప్రజాస్వామ్యమేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దర్గా తొలగింపు విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయింపు ప్రతి జెండా పండుగకు తాము ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసే దర్గా లేకపోవడంతో ముస్లింలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. దర్గా ఎదురుగా ఉన్న మున్సిపల్ చైర్మన్ రంగసింహాకు ఈ విషయం తెలియదా? అని ఆయన ఎదుట కాసేపు ధర్నా నిర్వహించారు. తొలగించిన ప్రదేశంలో మళ్లీ దర్గాను ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు బైఠాయించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు దిగివచ్చి తొలగించిన ప్రదేశంలోనే నాలుగు అడుగల స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని అనుమతి ఇచ్చారు. దర్గా అనుమతి కోసం కృషి చేసిన ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ జాతీయ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రెహమాన్, రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్‌బాషా, జమ్మలమడుగు నాయకులు గౌజ్‌లాజా, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కందునూరు జిగినీ, కొండపేట షరీఫ్, మత గురువులు ఫజిల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్): మండలంలోని జగన్నాథపురం హజరత్ కాలే మస్తాన్ షాఔలియా దర్గాలో మంగళవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి దర్గాలో ప్రత్యేక నమాజ్‌లు, భక్తి పాటలు ఆలపించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి, ఆమె కుమారుడు అబ్బిన రాజీవ్ చౌదరి నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు బొల్లిన రామకృష్ణ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుల మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం చందల్ ఊరేగింపు జరుగుతుందని దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి తెలిపారు. -
1400 ఏళ్లనాటి ప్రవక్త వస్తువుల ప్రదర్శన
-
కిటకిటలాడిన కౌతాళం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు సందర్భంగా మండలకేంద్రం కౌతాళానికి భక్తజనం పోటెత్తారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది స్వామి దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసి తెచ్చిన ఈ మహాప్రసాదాన్ని పొందేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం పలువురు ఖాదర్‌లింగ స్వామి శిష్యరికం పొందారు. ఎలాంటి చేడు పనులు చేయకూడదని, మంచి మార్గంలో నడుస్తూ ఐదుపూటల నమాజు చేయాలనిlధర్మకర్త ఈ సందర్భంగా వారికి బోధించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అధ్యక్షుడు మున్నపాష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నల్లప్ప గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
కమలాపుర౦ దర్గాను స౦దర్శి౦చిన వైఎస్ జగన్