మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు | special poojalu in maddi temple | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు

Published Tue, Apr 11 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు

మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం రూరల్‌: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు నిర్వహించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఒక్కరోజు ఆదాయం రూ.86,413 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. 1160 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement