సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ | jenco ceo visit solar project works | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ

Published Tue, Aug 30 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ

సోలార్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్‌కో సీఈ

గొల్లగూడెం (ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై నిర్మిస్తున్న 5 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులను మంగళవారం ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ కె.రత్నబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 15 నాటికి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. ఇది మోడల్‌ ప్రాజెక్టు కావటంతో దీని చుట్టుపక్కల దీని పనితీరును బట్టి మరిన్ని కొత్త పథకాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పురోగతిపై ఈఈ వీవీఎస్‌ మూర్తి చీఫ్‌ ఇంజినీర్‌కు వివరించారు. ఏడీలు కె. కోటేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement