మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు | mavullamma temple hundi income rs.21..99 laks | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు

Published Tue, Dec 13 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు

మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు

భీమవరం (ప్రకాశం చౌక్‌) : భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించగా రూ. 21,99,561 ఆదాయం లభించింది. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో బంగారం 082.400 మీలీ గ్రాములు, వెండి 0.218 మిల్లీగ్రాములు వచ్చింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత నెల 29న హుండీలను లెక్కించామని, అప్పటి నుంచి మంగళవారం వరకూ ఈ ఆదాయం లభించిందన్నారు. కలెక్టర్, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతివారం అమ్మవారి హుండీలను తెరిచి ఆదాయం లెక్కించి బ్యాంకులో జమ చేస్తామన్నారు. పర్యవేక్షణ అధికారి కర్రి శ్రీనివాసరావు, ధర్మకర్తలు శీరిగినీడి చంద్రశేఖర్, అడ్డగర్ల ప్రభాకరగాంధీ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement