రేపు బీజేపీ జాబితా
Published Tue, Mar 18 2014 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ బుధవారం లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేం దుకు సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ద్వారా జాబితాను ప్రకటింపజేసేందుకు ఆయనను ఆహ్వానించారు. మరో రెండు మోడీ సభలు నిర్వహించాలని నిర్ణయిం చారు. జాబితా ప్రకటనను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసుకున్న బీజేపీ ఈనెల 19న తప్పనిసరిగా ప్రకటిస్తామని సోమవారం ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ తరపున పోటీచేసే 8 మంది పేర్లు సిద్ధమయ్యూరుు. అయితే తిరుపూ రు అభ్యర్థి మాత్రం మారే అవకాశం ఉన్నారుు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్నాడీఎంకే, డీఎంకేలు లేకుండా బీజేపీ బలమైన కూటమిని ఏర్పాటు చేసింది.
గతంలో ఎన్నడూ లేనివిధం గా పార్టీ సైతం బలపడింది. ప్రతిష్టాత్మకమైన ఈ కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను రాజ్‌నాథ్ సింగ్ ద్వారా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు భావించారు. సోమవారం హోలీ పండు గ కావడంతో మంగళవారం ఆయన పర్యటనను ఖరారు చేసుకుంటారు. 19న చెన్నై టీనగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాబితా ను విడుదల చేస్తామని చెప్పారు.
మరోసారి మోడీ: రాష్ట్రంలో బీజేపీ కూటమిద్వారా పెద్ద సంఖ్యలో పార్లమెంటు స్థానాలను ఆశిస్తున్న నేతలు మరో రెండు చోట్ల నరేంద్రమోడీ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. తొలుత తిరుచ్చిలోనూ, ఆ తరువాత చెన్నై శివార్లు వండలూరులోనూ మోడీ సభలు జరిగాయి. కొత్తగా నిర్ణయించిన రెండు సభల ను ఉత్తర, పడమర చెన్నైలో నిర్వహించాలని భావిస్తున్నారు. మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా నే తేదీలు, ప్రాంతాల వారీగా ప్రకటిస్తారు.
ముసలం: బీజేపీలో స్థానాల పంపకాలు పూర్తరుు, నేడో రేపో అంటూ కాలయూపన చేస్తున్నారు. నియోజకవర్గాల కేటాయింపులో డీఎండీకే, పీఎంకేల మధ్య బీజేపీ నలిగిపోతోంది. ఒకరి స్థానాలు మరొకరు కోరడం, ఒకే స్థానంపై పలువురు పట్టుబట్టడం వంటి కారణాలతో కూటమిలో ముసలం నెలకొంది. కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండానే పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్ తాను ఎన్నుకున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీజేపీ పక్కలో బాంబు పేల్చారు. పదిరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ ఎట్టకేలకూ సర్దుకున్నారు. ప్రాంతీయ పార్టీల్లో భిన్నధృవాలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేల అధినేతలు విజయకాంత్, వైగో, రాందాస్‌లను మోడీ వేదికపై ఒకే సారి కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎడముఖం పెడముఖంగా ఉండే ముగ్గురు నేతలూ కూటమి ధర్మానికి కట్టుబడి కలిసివస్తారో లేదోనని బీజేపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరరావు సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, స్థానాల కేటాయింపులో ఎటువంటి కలతలు లేవని, 95.5 శాతం పూర్తయిందని తెలిపారు. 19వ తేదీన జాబితా విడుదల ఖాయమని పేర్కొన్నారు.
Advertisement
Advertisement