ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పోరాడాలి | governament figt for special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పోరాడాలి

Published Tue, Aug 30 2016 10:12 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పోరాడాలి - Sakshi

ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పోరాడాలి

పోలవరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించడానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు.

పోలవరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించడానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని వ్యూపాయింట్‌ నుంచి పనులను  పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబు ఆయనకు ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనాలన్నారు. సంఘ సంయుక్త కార్యదర్శి ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర   ఉపాధ్యక్షుడు డి.రమణయ్య, జిల్లా కార్యదర్శి ఆర్‌ఎస్‌ హరనాథ్, ఏలూరు పట్టణ అధ్యక్షులు సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement