'ఏ రాష్ట్రానికి చేయని సాయం ఏపీకి చేస్తున్నాం'
న్యూఢిల్లీ : దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం ఆంధ్రప్రదేశ్కు చేస్తున్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఐదేళ్లల్లో ఏపీకి రూ.2 లక్షల 65 వేల కోట్లు వస్తాయన్నారు. ఏపీకి అత్యుత్తమమైన ప్యాకేజీ ఇచ్చామన్నారు.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకే ఏపీ రాష్ట్రానికే అప్పగించామన్నారు. హోదా ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈఏపీ ద్వారా భర్తీ చేస్తామని జైట్లీ పేర్కొన్నారు.