నా హయాంలో పోలవరం.. అదృష్టం: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు తన హయాంలో పూర్తికావడం తన అదృష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1941 నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నాలు జరిగినా, ఇన్నాళ్లకు మోక్షం లభించిందని తెలిపారు.
డిసెంబర్ 30వ తేదీన పోలవరం కాంక్రీటు పనులు ప్రారంభిస్తామని, జనవరి 14న స్పిల్‌వే పనులు మొదలుపెడతామని ఆయన అన్నారు. 200 గిరిజన గ్రామాలకు పునరావాసం కల్పించడంతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉందని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నాటికి హంద్రీ-నీవా కూడా పూర్తి చేస్తామని అన్నారు.