ఒక్క మోటార్ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల
పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మంగళవారం ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. పోలవరం కుడి, ప్రధాన కాలువకు కృష్ణా జిల్లాలో గండిపడటంతో నీటి సరఫరాను నిలిపివేశారు. తిరిగి మంగళవారం ఒక మోటారు ద్వారా నీటిని విడుదల చేశారు.