గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
Published Wed, Aug 3 2016 12:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
పెదవేగి రూరల్ : పోలవరం కుడికాలువలో సోమవారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన నక్కా రాము మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయానికి శవమై కాలువలో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పెదవేగి ఏఎస్సై పి.సి.హెచ్. రఘురావ్ కథనం ప్రకారం.. ఏలూరు అరుంధతీ పేటకు చెందిన నక్కా దుర్గారావు రెండో కుమారుడు రాము చిన్నతనం నుంచి పెదవేగి మండలం ముండూరులోని అతని మేనమామ బట్టు రాజారావు దగ్గర పెరుగుతున్నాడు. తాపీపని చేస్తున్న అతను సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పోలవరం కాలువ గట్టుపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. అప్పటి నుంచి విస్తృత గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రాము మృతదేహాం పోలవరం కాలువలో పైకి తేలింది. మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఏఎస్సై రఘురావ్ చెప్పారు.
Advertisement
Advertisement