కూల్‌డ్రింక్స్ వ్యాన్‌బోల్తా
పోడూరు (పాలకొల్లు): పోడూరు మండలం జిన్నూరు వద్ద ప్రమాదవశాత్తు కూల్‌డ్రింక్స్ లోడుతో వెళుతున్న వ్యాన్ నరసాపురం ప్రధాన కాలువలోకి పల్టీ కొట్టింది. మంగళవారం మార్టేరు వైపు నుంచి పాలకొల్లు వస్తున్న వ్యాన్ మట్టపర్రు రోడ్డు దాటాక రైస్‌మిల్లు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ సమయంలో రోడ్డుపై వాహన రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.