jinnur
-
కూల్‌డ్రింక్స్ వ్యాన్‌బోల్తా
పోడూరు (పాలకొల్లు): పోడూరు మండలం జిన్నూరు వద్ద ప్రమాదవశాత్తు కూల్‌డ్రింక్స్ లోడుతో వెళుతున్న వ్యాన్ నరసాపురం ప్రధాన కాలువలోకి పల్టీ కొట్టింది. మంగళవారం మార్టేరు వైపు నుంచి పాలకొల్లు వస్తున్న వ్యాన్ మట్టపర్రు రోడ్డు దాటాక రైస్‌మిల్లు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ సమయంలో రోడ్డుపై వాహన రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. -
పోస్టల్ ఉద్యోగి అప్పారావు అరెస్ట్
జిన్నూరు (పోడూరు) : జిన్నూరు సబ్ పోస్టాఫీసులో డిపాజిట్ సొమ్ములు స్వాహా చేసిన కేసులో నిందితుడైన పోస్టల్ ఉద్యోగి కె.అప్పారావును సోమవారం అరెస్ట్ చేసి పాలకొల్లు జెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచినట్టు ఎస్ఐ డి.ఆదినారాయణ తెలిపా రు. డిపాజిట్ సొమ్ములు స్వాహాపై పోస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారని వెల్లడించారు. -
పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం
జిన్నూరు (పోడూరు) : జిన్నూరులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిన్నారు గ్రామానికి చెందిన రావి యోహాను (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య గల్ఫ్‌లో ఉంటుంది. ఏడేళ్లుగా ఆమె స్వగ్రామానికి రాలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వచ్చేయాలని యోహాను కొంతకాలంగా భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. అయినా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. స్థానికులు అతడ్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.