కుండపోత
కుండపోత
Published Wed, Sep 21 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
తాడేపల్లిగూడెం/రూరల్ : ఒక్కో చినుకు బాకులా భూమిని ఢీకొట్టింది. దీనికి తోడు పిడుగుల శబ్దం హోరెత్తింది. చినుకు నేలను తాకినప్పుడల్లా శబ్దం పుడుతుందా అన్నట్టుగా పిడుగుల శబ్దానికి భూమి దద్దరిల్లింది. మెరుపులు, ఉరుములతో కూడిన వాన గంటసేపు జిల్లాలోని పలు ప్రాంతాలపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. మంగళ వారం మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు ప్రారంభమైన వాన 6 గంటల వరకూ ఏకధాటిగా బాదింది. ఎక్కడి జనం అక్కడ స్తంభించిపోయారు. వరుణుడి దండయాత్ర ఆగిపోయాక ఏది రోడ్డో.. ఏది కాలువో తెలుసుకోలేని అయోమయ స్థితి. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా వానపడింది. గూడెంలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement