జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పల్లెల్లి శివకుమార్(25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన శివకుమార్ తన గది లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గదిలో పడుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు
ఉరివేసుకుని ఆర్‌ఎంపీ వైద్యుని ఆత్మహత్య
Published Tue, Aug 9 2016 8:29 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పల్లెల్లి శివకుమార్(25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన శివకుమార్ తన గది లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గదిలో పడుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఎంతసేపటికీ శివకుమార్ తన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికిలోంచి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. శివకుమార్‌కు ఐదునెలలక్రితమే ఊనగట్లకు చెందిన లక్ష్మీ ప్రియాంకతో వివాహం జరిగింది. ఇంతలోనే అతను మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శివకుమార్ తండ్రి వీరభద్రరరావు గతంలోనే మృతి చెందడంతో శివకుమార్ ఆర్‌ఎంపీ వైద్యునిగా పనిచేస్తూ.. తల్లిని, భార్యను పోషిస్తున్నారు. శివకుమార్ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఎస్‌ఐ ఆనందరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కొంతకాలంగా శివకుమార్ ను ఎవరో వేధిస్తున్నట్టు తెలిసిందని ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Advertisement
Advertisement