సీమ రైతాంగాన్ని ఆదుకుంటాం | help for sima farmers | Sakshi
Sakshi News home page

సీమ రైతాంగాన్ని ఆదుకుంటాం

Published Wed, Aug 31 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ.

పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ.

–మంత్రి నారాయణ
పీలేరు: వేరుశనగ పంట నష్టపోతున్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడక పోవడంతో చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేరుశన పంట దెబ్బతింటోందన్నారు.  నలుగురు మంత్రులు, 14 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లతో నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. 24 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాతోపాటు మూడు షిప్టులలో రెయిన్‌గన్స్, స్రింక్లర్ల ద్వారా వేరుశనగ పటంటకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాకు మొదటి విడతలో 4 వేల రెయిన్‌ గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్‌ ఇంజన్లు పంఫిణీ చేశామన్నారు. అదనంగా 1850 రెయిన్‌గన్స్‌ వచ్చాయని తెలిపారు. బుధవారం ఉదయం లోపు జిల్లాకు మరో 1500 రెయిన్‌ గన్స్‌ వస్తాయని చెప్పారు. ఒక్క ఎకరాకూడా వేరుశనగ పొలం ఎండినవ్వమని, అవసరం మేరకు అదనంగా రెయిన్‌ గన్స్‌ అందిస్తామని తెలిపారు. నిరంతరాయం విద్యుత్‌ సరఫరా ఉంటుందని తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లాలో వర్షం పడిదని, అవసరమైతే ఇంకా చిత్తూరు జిల్లాకు అనంతపురం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రెయిన్‌ గన్స్‌ తెప్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement