అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్
చింతలపూడి : ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పది మంది అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు మంగళవారం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ చింతలపూడి, లింగపాలెం మండలాలతోపాటు , ఖమ్మం జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన చింతలపూడికి చెందిన వెంకయ్యల ప్రభాకర్, పూడి రాంబాబు, కోట లక్ష్మణరావు, కొమ్ము నాగరాజు, నాగేంద్రబాబు, పి.వంశీకృష్ణ, పగడం ఏసుబాబు, కె.రంజిత్ కుమార్, ఇ.సంగయ్యలతోపాటు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న నందిపాం సుబ్బారావును మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.40 లక్షల విలువైన సొత్తు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ జి దాసు, ఎస్‌ఐ సైదా నాయక్, సిబ్బంది ఉన్నారు.