ఉత్కంఠభరితంగా అథ్లెటిక్స్ పోటీలు
Published Wed, Nov 30 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రా యూనివర్సిటీ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 2016–17 పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. రెండోరోజు మంగళవారం విజేతలను నిర్వాహకులు ప్రకటించారు.
న200 మీటర్ల రన్నింగ్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన పి.సాయి గౌతమ్, 400 మీటర్ల విభాగంలో ఎస్.చంద్రమౌళి (విశాఖపట్నం), 800 మీటర్ల విభాగంలో ఎల్.సాయికుమార్(విశాఖపట్నం), 1500 మీటర్ల విభాగంలో బి.మురళీరాజా (విశాఖపట్నం), 10,000 మీటర్ల విభాగంలో టి.అప్పారావు (విశాఖపట్నం), 110మీ హర్డిల్స్ విభాగంలో పి.సాయిగౌతమ్ (విశాఖపట్నం), షాట్‌పుట్ విభాగంలో ఎం.శివారెడ్డి(విశాఖపట్నం), డిస్కస్ త్రో విభాగంలో
బి.వెంకటరావు (విశాఖపట్నం), లాంగ్‌జంప్ విభాగంలో వై.ఓంకార్ (విజయనగరం), ట్రిపుల్ జంప్ విభాగంలో కె.ప్రవీణ్‌కుమార్ (బొబ్బిలి) విజయం సాధించారు. ఇదే విభాగంలో ఏలూరుకు చెందిన బి.పెరునాయుడు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాడు. హాఫ్ మార్తా¯ŒS విభాగంలో
జి.చిన్నారావు (విశాఖపట్నం) విజయం సాధించారు.
మహిళల పోటీల్లో 200 మీటర్లు విభాగంలో కె.విజయలక్షి్మ(విశాఖపట్నం), 400 మీ విభాగంలో కె.సాగరిక కనకదుర్గ (విశాఖపట్నం), 800 మీటర్ల విభాగంలో సీహెచ్ వాణి(విశాఖపట్నం), 1,500 మీటర్ల విభాగంలో ఎం.మౌనిక విజయనగరం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కె.సుశీల(విజయనగరం), షాట్‌పుట్ విభాగంలో సీహెచ్ ఉమ(విజయనగరం), డిస్కస్ త్రో విభాగంలో బి.సంధ్యారాణి( విశాఖపట్నం), లాంగ్ జంప్ విభాగంలో జి.పూజిత(విశాఖపట్నం), ట్రిపుల్ జంప్ విభాగంలో జి.పూజిత(విశాఖపట్నం) విజేతలుగా నిలిచారు.
Advertisement