వైఎస్సార్ సీపీ పటిష్టతే లక్ష్యం : ఆళ్లనాని
యలమంచిలి (పాలకొల్లు) : వైఎస్సార్ సీపీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని, దీనికోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) సూచించారు. స్థానిక తమ్మినీడి ఉమానరసింహ కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగ న్‌మోహ న్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇ న్‌చార్జ్ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన తెలుగుదేశం నాయకులు ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ అదనపు కన్వీనర్ గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారని చెప్పారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి రాజధాని అభివృద్ధిపై ఉన్న శ్రద్ధలో ఇసుమంతైనా ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. నరసాపురం నియోజకవర్గ ఇ న్‌చార్జ్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. వై.ఎస్.జగ న్‌మోహ న్‌రెడ్డి మోసపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటే ఇప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఉండేవారని, ఆయన నైజం అది కాదని స్పష్టం చేశారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మజ మాట్లాడుతూ రుణమాఫీ అంటూ రైతులు, మహిళలను, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటు యువతను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా నిరీక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ, నాయకులు పీడీ రాజు, గుణ్ణం సర్వారావు, మైలాబత్తుల మైఖేల్‌రాజు, ఎంపీటీసీ సభ్యులు చేగొండి సూర్యశ్రీనివాస్, శిరిగినీడి రామకృష్ణ, మోకా వెంకటలక్ష్మి నాయకులు బోనం బులివెంకన్న, విప్పర్తి నవీన్, చివటపు నాగేశ్వరరావు, కల్యాణం గంగాధరరావు, రావూరి వెంకటకోటి మురళీకృష్ణ, లంక చిరంజీవి, గుడాల సురేష్, ఉచ్చుల స్టాలిన్, మోకా నరసింహారావు, దేవరపు మల్లేశ్వరరావు, జల్లి నాగేశ్వరరావు, మద్దా చంద్రకళ, ఖండవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ 32 గ్రామ కమిటీల అధ్యక్షులను ఆళ్ల నానికి స్థానిక నేతలు పరిచయం చేశారు.