chinna venkanna
-
వైభవంగా ద్వారకా తిరుమలేశుడి కళ్యాణం
-
కల్యాణ వైభోగమే..
ద్వారకాతిరుమల : సర్వ జగద్రక్షకుడైన శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెండ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుర్ముఖినామ సంవత్సర ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం భక్తజన సందోహాలు, గోవిందనావు స్మరణలు, వేదవుంత్రోచ్ఛరణల నడుమ కడురవుణీÄýæుంగా సాగింది. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగవూన్ని అనుసరించి జరిపిన ఈ కల్యాణ తంతును భక్తజనులు వీక్షించి తరించారు. కల్యాణ వేడుక ఇలా.. శ్రీవారి అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చిన వెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కళా సౌందర్యాలు, పచ్చిపూలతో కల్యాణ వేదికను ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్కవాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అట్టహాసంగా ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. కల్యాణ తంతులో వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్రS, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టు వస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందించారు. ఈ కల్యాణ వేడుక ఆద్యంతం భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి ద్వారకా తిరుమల : ఆశ్వయుజమాసంలో మంచి ముహూర్తం కావడంతో చిన వెంకన్న క్షేత్రంలో పెళ్లిబాజాలు మారుమోగాయి. శనివారం ఉదయం క్షేత్ర పరిసరాల్లో వివాహాలు అధికంగా జరిగాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ప్రాంతం, దేవస్థానం, ప్రై వేటు సత్రాల్లో ఈ వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్ర పరిసరాలు పెళ్లిజనాలతో కళకళలాడాయి. వివాహాలు జరుపుకున్న అనంతరం నూతన వధువరులు, వారి బంధువులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. వైభవం.. గరుడోత్సవం శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. గరుడు స్వామివారికి నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, గజసేవల నడుమ విశేష అలంకారాల్లో చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి – భజన సంకీర్తనలు ఉదయం 10 గంటల నుంచి – భక్తి రంజని సాయంత్రం 5 గంటల నుంచి – ఉపన్యాసం సాయంత్రం 6 గంటల నుంచి – భరతనాట్యం రాత్రి 7 గంటల నుంచి – మోహినీ భస్మాసుర నాటకం రాత్రి 7 గంటల నుంచి – శ్రీవారి దివ్య రథోత్సవం -
శ్రీవారి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) ఆలయంలో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఆలయ భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించామని ఏఆర్ ఎసై నాగేశ్వరులు అన్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాలు, ప్రధాన, తూర్పు రాజగోపుర ప్రాంతాలు, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాలలు, పలు విభాగాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. క్షేత్రానికి వచ్చిన భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో తనిఖీలు జరుపుతున్నట్టు తనిఖీ సిబ్బంది తెలిపారు. డాగ్ హ్యాండ్లర్ డీడీ ప్రసాద్, విజయ, రంగారావు, డాగ్ లిజీ పాల్గొన్నారు. -
అత్తారింటికి దారేది?
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్: చినవెంకన్నను ప్రతి ఏటా కనుమపండుగనాడు గిరిప్రదక్షిణ గావించే ప్రాంతంలో కొం దరు కంచె వేసి చదును చేస్తుండటంతో స్వామివారు అత్తారింటికి వెళ్లే దారి ప్రశ్నార్థకమయ్యింది. స్వామివారిని గిరిప్రదక్షణ చేయించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. దేవస్థానం గిరిప్రదిక్షణకు దశాబ్దాలుగా వినియోగిస్తున్న దొరసానిపాడులోని ఈదారిని ప్రస్తుతం మూసివేశారు. ఈదారి ప్రభుత్వ పోరంబోకు భూమి ఆర్ఎస్ నంబర్ 317లో 17 ఎకరాల 34 సెంట్ల విస్తీర్ణం ఉంది. 1999 లో దీన్ని ఎమ్విఎస్ఎస్ ప్రసాద్ అనే వ్యక్తికి మైనింగ్ తవ్వకానికి ప్రభుత్వం లీజుకిచ్చింది. ఆలయం చుట్టూ మైనింగ్ త్రవ్వకాల వల్ల ప్రధాన ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని 2002లో దేవస్థానం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి ప్రభు త్వ ఉప కార్యదర్శి దుర్గారావు లీజు హక్కును రద్దు చేస్తూ ఆగస్టు 22, 2003న 8542/ఎమ్3 మెమోను జారీ చేశారు. దీనికి ముందుగానే భూమి యాజమాన్యం హక్కులపై భూగర్భ ఖనిజ శాఖ అప్పటి తహసిల్దారు జి.వెంకట్రావును వివరణ కోరింది. దీనిపై తహసిల్దారు వెంకట్రావు ఆర్వోసీ ఎ1/219/1999 ప్రకారం ఈభూమిలో పట్టాదారులు లేర ని, కొండ పోరంబోకు అని తేల్చారు. పట్టాలెక్కడివి? ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఈభూమిలో కొందరు తమకు పట్టాలున్నాయంటూ.. కంచెలు వేసి భూమిని చదును చేస్తున్నారు. కొంత భూమిలో జామాయిల్ సాగుకు మొక్కలు వేస్తుం డగా, మరికొంత భూమిని అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూమిలో పట్టాదారులెవరూ లేరని, అప్పటి తహసిల్దారు తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆకస్మికంగా పట్టాలు ఎలా వచ్చాయో అర్థం కాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ స్థలం అన్యక్రాంతమవుతున్నా సంబంధిత అధికార యం త్రాంగం మొద్దునిద్ర పోతోందని పలువురు విమర్శిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈభూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. దేవస్థానం భూసేకరణ కోరిన తరువాత ఈభూమికి పట్టాలొచ్చాయా.. లేక ముందే పట్టాలున్నాయా.. అలా ఉంటే అప్పటి తహసిల్దారు ఇది పోరంబోకు భూమని ఎలా సర్టిఫై చేశారనే ప్రశ్నలకు రెవెన్యూ అధికారులే సమాధానం చెప్పాలి. దేవస్థానం అధికారులు ఏం చేస్తు న్నారు? శతాబ్దాలుగా స్వామివారి సేవలకు విని యోగిస్తున్న ఈ భూమి తమకు అవసరమని భావించి 2002 - 2006లో శ్రీవారి దేవస్థానం భూసేకరణకు చర్యలు చేపట్టింది. అది ప్రభుత్వ పోరంబోకు భూమి కావడంతో దేవస్థానం భూసేకరణ కోరినప్పటికీ మిన్నకుంది. శ్రీవారి సేవలకు వినియోగించే ఆభూమి తమదేనని కొం దరు పట్టాలు పట్టుకుని తిరుగుతున్నా.. అది వారిదో కాదో తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం వల్లే ఈపరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరికైనా పట్టాలుంటే వారికి నష్టపరిహా రం చెల్లించి తీసుకోవడమో.. పట్టాలు సరైనవి కాకపోతే రెవెన్యూ అధికారుల ద్వారా ఆ స్థలాన్ని భూసేకరణ ద్వారా తీసుకునే అవకాశం దేవస్థానానికి ఉంది. జిల్లా అధికారులు వివాదాస్పద భూమిపై విచారణ చేసి చినవెంకన్నకు అత్తారింటికి దారి చూపాలని భక్తులు కోరుతున్నారు. ఈవో వివరణ 1999లో ఈ భూమి రెవెన్యూ పరిధిలో పోరంబోకు భూమి అని అధికారులు ధ్రువీ కరించినట్లు పత్రాలున్నాయన్నారు. అప్ప ట్లో భూసేకరణ కోరినదాంట్లో ఈ సర్వే నంబర్ ఉందన్నారు. రెవెన్యూ శాఖ భూసేకరణ ద్వారా ఈభూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందన్నారు.