ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్: చినవెంకన్నను ప్రతి ఏటా కనుమపండుగనాడు గిరిప్రదక్షిణ గావించే ప్రాంతంలో కొం దరు కంచె వేసి చదును చేస్తుండటంతో స్వామివారు అత్తారింటికి వెళ్లే దారి ప్రశ్నార్థకమయ్యింది. స్వామివారిని గిరిప్రదక్షణ చేయించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. దేవస్థానం గిరిప్రదిక్షణకు దశాబ్దాలుగా వినియోగిస్తున్న దొరసానిపాడులోని ఈదారిని ప్రస్తుతం మూసివేశారు. ఈదారి ప్రభుత్వ పోరంబోకు భూమి ఆర్‌ఎస్ నంబర్ 317లో 17 ఎకరాల 34 సెంట్ల విస్తీర్ణం ఉంది. 1999 లో దీన్ని ఎమ్‌విఎస్‌ఎస్ ప్రసాద్ అనే వ్యక్తికి మైనింగ్ తవ్వకానికి ప్రభుత్వం లీజుకిచ్చింది. ఆలయం చుట్టూ మైనింగ్ త్రవ్వకాల వల్ల ప్రధాన ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని 2002లో దేవస్థానం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి ప్రభు త్వ ఉప కార్యదర్శి దుర్గారావు లీజు హక్కును రద్దు చేస్తూ ఆగస్టు 22, 2003న 8542/ఎమ్3 మెమోను జారీ చేశారు. దీనికి ముందుగానే భూమి యాజమాన్యం హక్కులపై భూగర్భ ఖనిజ శాఖ అప్పటి తహసిల్దారు జి.వెంకట్రావును వివరణ కోరింది. దీనిపై తహసిల్దారు వెంకట్రావు ఆర్‌వోసీ ఎ1/219/1999 ప్రకారం ఈభూమిలో పట్టాదారులు లేర ని, కొండ పోరంబోకు అని తేల్చారు.
పట్టాలెక్కడివి?
ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఈభూమిలో కొందరు తమకు పట్టాలున్నాయంటూ.. కంచెలు వేసి భూమిని చదును చేస్తున్నారు. కొంత భూమిలో జామాయిల్ సాగుకు మొక్కలు వేస్తుం డగా, మరికొంత భూమిని అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూమిలో పట్టాదారులెవరూ లేరని, అప్పటి తహసిల్దారు తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆకస్మికంగా పట్టాలు ఎలా వచ్చాయో అర్థం కాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ స్థలం అన్యక్రాంతమవుతున్నా సంబంధిత అధికార యం త్రాంగం మొద్దునిద్ర పోతోందని పలువురు విమర్శిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈభూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. దేవస్థానం భూసేకరణ కోరిన తరువాత ఈభూమికి పట్టాలొచ్చాయా.. లేక ముందే పట్టాలున్నాయా.. అలా ఉంటే అప్పటి తహసిల్దారు ఇది పోరంబోకు భూమని ఎలా సర్టిఫై చేశారనే ప్రశ్నలకు రెవెన్యూ అధికారులే సమాధానం చెప్పాలి.
దేవస్థానం అధికారులు ఏం చేస్తు న్నారు?
శతాబ్దాలుగా స్వామివారి సేవలకు విని యోగిస్తున్న ఈ భూమి తమకు అవసరమని భావించి 2002 - 2006లో శ్రీవారి దేవస్థానం భూసేకరణకు చర్యలు చేపట్టింది. అది ప్రభుత్వ పోరంబోకు భూమి కావడంతో దేవస్థానం భూసేకరణ కోరినప్పటికీ మిన్నకుంది. శ్రీవారి సేవలకు వినియోగించే ఆభూమి తమదేనని కొం దరు పట్టాలు పట్టుకుని తిరుగుతున్నా.. అది వారిదో కాదో తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం వల్లే ఈపరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరికైనా పట్టాలుంటే వారికి నష్టపరిహా రం చెల్లించి తీసుకోవడమో.. పట్టాలు సరైనవి కాకపోతే రెవెన్యూ అధికారుల ద్వారా ఆ స్థలాన్ని భూసేకరణ ద్వారా తీసుకునే అవకాశం దేవస్థానానికి ఉంది. జిల్లా అధికారులు వివాదాస్పద భూమిపై విచారణ చేసి చినవెంకన్నకు అత్తారింటికి దారి చూపాలని భక్తులు కోరుతున్నారు.
ఈవో వివరణ
1999లో ఈ భూమి రెవెన్యూ పరిధిలో పోరంబోకు భూమి అని అధికారులు ధ్రువీ కరించినట్లు పత్రాలున్నాయన్నారు. అప్ప ట్లో భూసేకరణ కోరినదాంట్లో ఈ సర్వే నంబర్ ఉందన్నారు. రెవెన్యూ శాఖ భూసేకరణ ద్వారా ఈభూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందన్నారు.
అత్తారింటికి దారేది?
Published Wed, Sep 18 2013 12:16 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement