చెట్టుకింద కలెక్టర్ | collecter solving village problems | Sakshi

చెట్టుకింద కలెక్టర్

Published Fri, Jan 10 2014 3:05 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

చెట్టుకింద కలెక్టర్ - Sakshi

చెట్టుకింద కలెక్టర్


 పల్లె సమస్యల్ని తెలుసుకునేందుకు
 ప్రజలతో పంచారుుతీ
 ఔను.. ఓ చెట్టుకింద సిమెంట్ బల్లపై కూర్చున్నది మన జిల్లా  కలెక్టరే.. నీడకోసం చెట్టుకిందకు చేరారేమో అనుకోకండి. గురువారం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి ఆకస్మిక తనిఖీల నిమిత్తం వచ్చిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఇలా దర్శనమిచ్చారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే చెట్టుకింద ప్లీడర్ తరహాలో పంచారుుతీ నిర్వహించారు. బల్లపై కూర్చున్నది కలెక్టర్ అని తెలుసుకున్న ప్రజలు ఒక్కొక్కరుగా వెళ్లి గ్రామంలో నెలకొన్న మంచినీరు, పారిశుధ్యం వంటి సమస్యలను ఏకరువుపెట్టారు. సుమారు అరగంటపాటు ఆయన చెట్టుకిందే కూర్చుని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఆయూ శాఖల అధికారులకు సూచనలను ఇచ్చారు.
 - న్యూస్‌లైన్/ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement