siddarth jain
-
నగరి డీఎస్పీని సస్పెండ్ చేయాలి
చిత్తూరు(సెంట్రల్): పుత్తూరు డీఎస్పీ కృష్ణమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇటీవల నగరిలో జాతర సందర్భంగా జరిగిన గొడవకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆమె తెలిపారు. జాతరలో తనపై జరిగిన గొడవకు కారణమైన మాజీ శాసనసభ్యుని అనుచరులు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని, మంగళవారం నగరి మున్సిపల్ చైర్పర్సన్,మాజీ చైర్మన్‌తో కలిసి వెళ్లి జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కోరినట్లు ఆమె విలేకరులకు చెప్పారు. గొడవ జరిగే అవకాశం ఉందని తాను ముందుగానే డీఎస్పీకి వివరించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన పట్టించుకోకపోగా ఉద్దేశపూర్వకంగానే అధికారపార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించారని తెలిపారు. నగరి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినందున డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, దీని నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నగరికి మంజూరైన నీటి శుద్ధి ప్లాంటు ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.భరత్‌గుప్తాను ఆయన కార్యాలయంలో కలసి నగరి వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రి, నగరి మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్మన్ ఉన్నారు. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ నెల ఏడు జరిగే పోలింగ్‌కు ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలకు 29 మంది, 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 163 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని రకాల ఎన్నికల ప్రచారాలు నిలుపుదల చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. ఉభయగోదావరి జిల్లాలలో ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిందని, ఈ దిశగా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు విస్తృతమైన తనిఖీలు చేపట్టి నిరోధించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లాలో నిఘా బృందాల ద్వారా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించడానికి ఓటర్లు సహ కరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీపై సమాచారం అందించాలని కోరారు. వీరి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు సముచితమైన రివార్డు అందిస్తామని పేర్కొన్నారు. 29,10,414 మంది ఓటర్లు జిల్లాలో 29,10,414 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 14,36,286, మహిళలు 14,73,968, ఇతరులు 160 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,36,825 మంది ఓటర్లు ఉండగా, నరసాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,54,417 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 3,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,518, పట్టణ ప్రాంతాల్లో 537 ఉన్నాయన్నారు. మొత్తం 30,776 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని, పరోక్షంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఇతర సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నార న్నారు. పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులుగా 3,573 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,552, అదనపు పోలింగ్ సిబ్బంది 20,917, మైక్రో అబ్జర్వర్లు 312, వీడియోగ్రాఫర్లు 370, డ్రైవర్లు 949, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు 34 మందిని నియమించామన్నారు. ఈ ఎన్నికల్లో 19,578 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 1603 మందికి సర్వీసు ఓట్లు ఉన్నాయని వివరించారు. ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కారం జిల్లాలో ఓటర్లకు 29,14,414 ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకూ 17,42,270 ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6,600 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు మొదటి చెకప్ పూర్తి చేసి నియోజకవర్గాలకు పంపామన్నారు. వీటికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కరించేందుకు నియోజకవర్గానికి ఒక ఇంజనీర్‌ను, ఇద్దరు హౌసింగ్ ఇంజినీర్లను నియమించామని, అదనంగా ఈవీఎంలను కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు ర్యాంప్ సౌకర్యం కల్పించామని చెప్పారు. సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి జిల్లాలో ఎన్నికల సంబంధమైన ఫిర్యాదులను తెలియజేయడానికి 1800-425-1365 నెంబరుతో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లలో చైతన్యాన్ని కలిగించేందుకు ప్రచార రథాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించామని, గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు స్లిప్పులు తీసుకోకపోతే పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పొందవచ్చన్నారు. అదేవిధంగా ఓటరు గుర్తింపు కార్డులు లేనివారు పాన్‌కార్డు, డ్రైనింగ్ లెసైన్స్ తదితర ఫొటో గుర్తింపు కార్డును చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 2361 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 276 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘించిన 27,086 మందికి నోటీసులు జారీ చేశామని, 2,281 మద్యం కేసులను సీజ్ చేశామని, 1468 మందిని అరెస్టు చేశామని కలెక్టర్ చెప్పారు. జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణలు పాల్గొన్నారు. -
పథకాలపై అవగాహన పెంచండి
‘బంగారుతల్లి’ని సమర్థవంతంగా అమలు చేయండి 2013 మే 1వ తేదీ తర్వాత జన్మించిన ప్రతి ఆడపిల్లనూ బంగారుతల్లి పథకంలో నమోదు చేయాలన్నారు. వారికి రూ.2,500 తొలి విడతగా జమ చేయాలన్నారు. పథకం వర్తింపునకు జనన ధుృవీకరణ, రేషన్ కార్డు, ఆధార్, బిడ్డతో కలిగిన ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ వివరాలు అవసరం అవుతాయన్నారు. ఏలూరు, న్యూస్‌లైన్ : పేదలకు ఆసరాగా నిలుస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహనకు మహిళా సమాఖ్యలు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ అభిప్రాయపడ్డారు. సత్రంపాడులోని టీటీడీసీలో శుక్రవారం 113వ జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలపై దాదాపు 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. పేదల ఆర్థికాభివృద్ధితో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం రూపొందించిందన్నారు. ఆశయాల అమలుకు మహిళా సమాఖ్యలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకేపీ రుణాలు, పెన్షన్లు, బంగారుతల్లి, రుణా లు తిరిగి చెల్లింపు, గ్రూపు ఖాతాలు, పొదుపు తీరు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతినెలా 10 మండలాల్లో జిల్లా సమాఖ్యకు చెందిన ఆయా కమిటీలు పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ‘సునందిని’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 6 వేల 430 కృత్రిమ గర్భోత్పత్తి ఆడదూడలు, సంకరజాతి దూడలు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామన్నారు. వాటికి 32 నెలలు వయస్సు వచ్చేంత వరకు దాణా, మందులు, వ్యాక్సిన్లు, బీమా సౌక్యర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుంచండి జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు రుణాలు అందించడం, పెన్షన్లు పంపిణీ, బంగారుతల్లి తదితర కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమంలో ఉంచడంలో మహిళా సమాఖ్యలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జనవరి 26 నుంచి పాలసేకరణ చేపట్టాలి జిల్లాలో రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన 19 బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కావాలన్నారు. పాలసేకరణలో సంబంధిత స్వయం సహాయక సంఘాలు నిమగ్నం కావాలన్నారు. జిల్లాలో నిర్మల్ భారత్ అభియాన్ కింద 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం రూ. 9100 సబ్సిడీగా అందిస్తున్నదని, ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో డీఆర్ డీఏ పీడీ వై.రామకృష్ణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి, పశుసంవర్థకశాఖ జేడీ కె.జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు. -
చెట్టుకింద కలెక్టర్
పల్లె సమస్యల్ని తెలుసుకునేందుకు ప్రజలతో పంచారుుతీ ఔను.. ఓ చెట్టుకింద సిమెంట్ బల్లపై కూర్చున్నది మన జిల్లా కలెక్టరే.. నీడకోసం చెట్టుకిందకు చేరారేమో అనుకోకండి. గురువారం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి ఆకస్మిక తనిఖీల నిమిత్తం వచ్చిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఇలా దర్శనమిచ్చారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే చెట్టుకింద ప్లీడర్ తరహాలో పంచారుుతీ నిర్వహించారు. బల్లపై కూర్చున్నది కలెక్టర్ అని తెలుసుకున్న ప్రజలు ఒక్కొక్కరుగా వెళ్లి గ్రామంలో నెలకొన్న మంచినీరు, పారిశుధ్యం వంటి సమస్యలను ఏకరువుపెట్టారు. సుమారు అరగంటపాటు ఆయన చెట్టుకిందే కూర్చుని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఆయూ శాఖల అధికారులకు సూచనలను ఇచ్చారు. - న్యూస్‌లైన్/ద్వారకాతిరుమల -
ఆధార్ సీడింగ్‌ను వేగిరపర్చండి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెలాఖరు నాటికి నూరుశాతం రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆదివారం ఆధార్ అనుసంధానం, అమ్మహస్తం, నిత్యావసర సరుకుల పంపిణీ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అర్హత గల ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానమే మార్గమని చెప్పారు. జిల్లాలో 12 లక్షల తెల్ల రేషన్‌కార్డులకు 33 లక్షల యూనిట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం పూర్తి అయ్యిందన్నారు. మిగిలిన 10 లక్షల యూనిట్ల అనుసంధాన పక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తిచేసేం దుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఆధార్‌కార్డులు అందించాలనే లక్ష్యంతో 46 మండలాల్లో శాశ్వత ఆధార్ కార్డుల జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమ్మహస్తం పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డీలర్లను కోరారు. చౌకడిపో డీలర్లు బాధ్యతాయుతంగా పనిచే యడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామని చె ప్పారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ డీలర్లకు బ్యాం కుల నుంచి రుణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సివిల్ సప్లయిస్ జీఎం సలీంఖాన్, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన కలెక్టర్
ఏలూరు, న్యూస్‌లైన్ : తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదివారం మినీ బైపాస్ రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయం పోలింగ్ బూత్‌లో బీఎల్వోకు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కుర్చీలో కూర్చొమని బూత్‌లెవెల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరినా ఆయన నిలబడే ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఓటుహక్కు కావాలంటే స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఏదైనా ధృవపత్రం సమర్పించాలని బీఎల్వో జయలక్ష్మి కోరారు. ఆధార్ కార్డు ఉందా అని ప్రశ్నించగా తాను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆధార్ కార్డు ఉందని, నివాస వివరాలన్ని అక్కడే ఉన్నాయని కలెక్టర్ సమాధానమిచ్చారు. రేషన్ కార్డు ఉందా అని బీఎల్వో ప్రశ్నించగా రేషన్ కార్డు తీసుకోవడానికి తనకు తీరిక ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు. ఖమ్మం అడ్రస్ ఉంటే ఇక్కడ పనికిరాదని, పోనీ ఏదైనా బ్యాంకు ఖాతా ఉందా అని జయలక్ష్మి కలెక్టరును ప్రశ్నించారు. బ్యాంకు ఖాతా ఇక్కడే ఉందని దాని నకలు వెంటనే సమర్పిస్తానని ఈ లోగా ఓటుహక్కు దరఖాస్తు ఫారాన్ని పరిశీలించాలని సిద్దార్ధజైన్ కోరారు. ఆమె దరఖాస్తును పరిశీలిస్తూ రెండు ఫొటోలకు బదులు ఒక ఫొటో ఇచ్చారు, మరో ఫొటో ఇవ్వాలని కోరారు. సరిగా చూసుకో అమ్మా. నీకు రెండు ఫొటోలు ఇచ్చా.. అంటూ కలెక్టర్ చిరునవ్వు చిందించారు. అనంతరం కలెక్టర్ దరఖాస్తు ఫారంపై సంతకం చేసి అందజేసిన లోగానే బ్యాంకు పాస్‌బుక్ నకలు కూడా సమర్పించారు. ఈ వ్యవహరం జరుగుతున్నంతసేపూ కలెక్టర్ సామాన్య పౌరుని మాదిరిగానే వ్యవహరించారు. ఓటరు నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతులపై బీఎల్వో వ్యవహరించిన తీరుపట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరు హోదాలో కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాలుగు వారాలుగా 109 దరఖాస్తులు అందాయని వాటిలో 98 విచారణ చేసి 91 మందికి ఓటుహక్కు కల్పించాలని సిఫార్స్ చేసినట్టు బీఎల్వో జయలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. మరో ఏడుగురు హైదరాబాదు, తిరుపతి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఇక్కడ ఓటు కోసం దరఖాస్తు చేశారని వాటిని తిరస్కరించినట్టు తెలిపారు. -
స్వయం సహాయక సంఘాలకు రూ. వెయ్యి కోట్లు
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.వెయ్యి కోట్ల రుణాలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల పనితీరు, ఎంపీ లాడ్స్ వినియోగంపై అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే మార్చిలోగా రూ.87 కోట్లు, పల్లెల్లో రూ.913 కోట్లు రుణాలను అందించి మహిళల ఆర్థిక పురోభివృద్ధికి బ్యాంకులు దోహదపడాలన్నారు. జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద ఇచ్చే లబ్ధిని ఈ నెలాఖరు నాటికి ఇవ్వాలన్నారు. భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు బోర్లు మంజూరు చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లు జారీలో జాప్యం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈ సూర్యప్రకాష్‌ను ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా, కుటుంబ నియంత్రణ లక్ష్యాలను అధిగమించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీ లాడ్స్ పనుల్లో జాప్యాన్ని సహించను పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఎంపీలాడ్స్ పనుల ప్రగతి తీరును ఆయన సమీక్షించారు. అపరిష్కృతంగా ఉన్న పనులను 2014 జనవరి, 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. వీఆర్ఏలకు రెండు నెలల అడ్వాన్స్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వీఆర్ఏలకు ప్రభుత్వం రెండు నెలలకు రూ.7 వేలు ప్రత్యేక అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించిందని, తహసిల్దార్లు ఆ మొత్తాలను వారికందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కొత్త బీమా పథకం ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్ ) : భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వారికి ప్రస్తుతం అమలవుతున్న ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజనతో పాటు మరోక సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పనిచేసే ప్రదేశంలో కాని ఇతర ప్రదేశాలలో గాని, నిర్మాణ సమయంలో గాయపడి ఆ గాయాలతో మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. శాశ్వత వికలాంగత్వానికి గురైన కార్మికునికి కూడా రూ. 2 లక్షల వరకు సహాయం అందుతుందని తెలిపారు. 120 గ్రామాల్లో 12 వేల మరుగుదొడ్లు ఏలూరు : జిల్లాలో పల్లెనిద్ర-ప్రగతిబాట పేరిట 120 గ్రామాల్లో 12 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను 2014 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ లక్ష్యంగా నిర్ణయించారని డ్వామా పీడీ ఎన్. రామచంద్రారెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని కోరారన్నారు. -
ముంపు ముప్పు తప్పిస్తాం : కలెక్టర్ సిద్ధార్థజైన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ భూములను ముంపు ముప్పునుంచి తప్పించడం.. రైతులను నష్టాల నుంచి గట్టెక్కించడమే తన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అందుకే డెల్టా ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా చేయించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించామని, దానిని క్రమపద్ధతిలో అమలు చేస్తామని తెలిపారు. ఏటా ఖరీఫ్ సీజన్లో డెల్టాలో ముంపు సమస్య ఏర్పడుతోందని,డెల్టా ఆధునికీకరణ చేపట్టడమే దీనికి పరిష్కారమని పేర్కొన్నారు. కాలువలతో పాటు డ్రెయిన్ల ఆధునికీకరణ పనులను కూడా ఒకేసారి చేపడతామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ తదితర ఎటువంటి ఇబ్బందులు లేని కీలకమైన కొన్ని పనులను గుర్తించామని వాటిని వెంటనే చేపడతామని చెప్పారు. భీమవరం మండలం లోసరి వద్ద రైతులు త్వరగా పంటను ముగించేందుకు సిద్ధమయ్యారని, సాగు పూర్తవగానే అక్కడ పనులు చేపడతామని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు సమీపంలో ఎర్రకాలువపై ఆక్విడెక్టు వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. డెల్టాలో అన్నిచోట్లా రైతులతో మాట్లాడి వారికి ఇబ్బందిలేని రీతిలో పనులు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రైతులు సహకరిస్తే ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుందని, వారు కొంత వెసులుబాటు ఇస్తే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని అన్నా రు. రైతులు సహకారం అందించినా కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆధునికీకరణ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ కార్యక్రమం లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 65 వేలకుపైగా మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడానికి ప్రా ధాన్యత ఇస్తామని చెప్పారు. జిల్లాలో బంగారుతల్లి పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని, తద్వారా రోగులకు వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తన విధి అని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. -
బాసటగా ఉంటాం కలెక్టర్ సిద్ధార్థజైన్
ఏలూరు, న్యూస్‌లై న్ : జిల్లా రైతులకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ స్ఫూర్తితో జిల్లా సమగ్రాభివృద్ధికి, పేదలను ఆదుకునే సంక్షేమ పథకాల అమలులో ముందడుగు వేసేందుకు జిల్లా యంత్రాంగం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, పంట రుణాలు, సాగునీటి సరఫరా, పంటలకు మద్దతు ధర వంటి అంశాల్లో రైతులకు జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.3,114 కోట్లను పంట రుణాలుగా అందించామని చెప్పారు. 1.24 లక్షల మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులను అందించామన్నారు. ఈ ఏడాది 54వేల మంది కౌలుదారులకు రూ.132 కోట్లను రుణాలు ఇచ్చామని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీశాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1 లక్షా 47 వేల 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోరుున రైతులందరినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందించేందుకు 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. డెల్టా ఆధునికీకరణకు రూ.1,464 కోట్లు : సాగునీరు సక్రమంగా పంపిణీ అయ్యేందుకు, లోతట్టు ప్రాంతాలను ముంపు బారినుంచి కాపాడేందుకు రూ.1,464 కోట్లతో చేపట్టిన డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేస్తామని సిద్ధార్థజైన్ చెప్పారు. కొల్లేరు ప్రాంతాన్ని ముంపునుంచి రక్షించేందుకు రూ.12కోట్లతో ఇన్ఫాలింగ్ డ్రెయిన్లు, రూ.81 కోట్లతో యనమదుర్రు డ్రెయిన్, రూ.87 కోట్లతో ఎర్రకాల్వ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు, మాతా శిశు మరణాలను మరింతగా తగ్గించేందుకు, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న సంకల్పంతో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద జిల్లాలో 75 వేల కుటుంబాలకు వాటిని నిర్మించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.75 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర కృషి వికాస యోజన, పశుక్రాంతి పథకాల కింద రూ.77 లక్షల సబ్సిడీతో 250 పాడి పశువులను అందించినట్టు చెప్పారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న దృష్ట్యా విద్యార్థులు మంచి మార్కులతో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ ఎం .రమేష్, డీఆర్వో కె.ప్రభాకరరావు, విజిలెన్స్ ఎస్పీ ఎం.నారాయణ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బి.చ ంద్రారెడ్డి, ఆర్డీవోలు బి.శ్రీనివాస్, గోవిందరావు, డీపీవో అల్లూరి నాగరాజు వర్మ, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, తహసిల్దార్ ఏజీ చిన్నికృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ కె.శ్రీనివాస్ శర్మ, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.వేణుగోపాల్, డీఈవో నరసిం హరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, హౌసిం గ్ పీడీ జి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, మెప్మా పీడీ వీవీ శేషారెడ్డి, సెట్వెల్ సీఈవో ఎండీహెచ్ మెహర్రాజ్ పాల్గొన్నారు.