ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెలాఖరు నాటికి నూరుశాతం రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆదివారం ఆధార్ అనుసంధానం, అమ్మహస్తం, నిత్యావసర సరుకుల పంపిణీ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అర్హత గల ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానమే మార్గమని చెప్పారు. జిల్లాలో 12 లక్షల తెల్ల రేషన్‌కార్డులకు 33 లక్షల యూనిట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం పూర్తి అయ్యిందన్నారు.
మిగిలిన 10 లక్షల యూనిట్ల అనుసంధాన పక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తిచేసేం దుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఆధార్‌కార్డులు అందించాలనే లక్ష్యంతో 46 మండలాల్లో శాశ్వత ఆధార్ కార్డుల జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమ్మహస్తం పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డీలర్లను కోరారు. చౌకడిపో డీలర్లు బాధ్యతాయుతంగా పనిచే యడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామని చె ప్పారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ డీలర్లకు బ్యాం కుల నుంచి రుణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సివిల్ సప్లయిస్ జీఎం సలీంఖాన్, డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆధార్ సీడింగ్‌ను వేగిరపర్చండి
Published Mon, Dec 16 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement