Salim Khan
-
అయోధ్య తీర్పుపై సల్మాన్ తండ్రి స్పందన
ముంబై: శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుదితీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆలయనిర్మాణం కోసం మూడునెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యం పలువురు ముస్లిం ప్రముఖులు స్పందిస్తూ.. తీర్పును వ్యతిరేకించారు. కొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతించారు. ఇందులో భాగంలో బాలీవుడ్ లెజండరీ గీత రచయిత, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అయోధ్య-బాబ్రీ మసీదు భూవివాదం తీర్పుపై స్పందించారు. ముస్లిం సోదరులకు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదు బదులుగా విద్యాసంస్థలు నిర్మించాలని సూచించారు. ప్రవక్త వివరించిన విధంగా ఇస్లాం మతంలోని రెండు ధర్మాలు.. ప్రేమ, క్షమకు ముస్లిం సోదరులు కట్టుబడి ముందుకు సాగాలన్నారు. తీర్పు ఇవ్వటం పూర్తి అయిందని, ఇక మళ్లీ ఈ వివాదాన్ని తిరగతోడకుడదన్నారు. ప్రేమ, క్షమను చూపాలన్నారు. ఇంత సున్నితమైన తీర్పు ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా శాంతి, సామరస్యాన్ని కొనసాగించిన విధానం ప్రశంసనీయమన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడటాన్ని స్వాగతిస్తున్నానని సలీమ్ తెలిపారు. కాగా ముస్లింలు దీని గురించి వ్యతిరేకంగా చర్చింటానికి బదులుగా.. తమ ప్రాథమిక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. తీర్పు ప్రకారం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముస్లిం పిల్లల విద్యకు ఉపయోగపడే.. పాఠశాల, కాలేజీలు నిర్మిస్తే మంచిదన్నారు. అదే విధంగా ముస్లింల అసలు సమస్య సరైన విద్యలేకపోవడమని.. కావున అయోధ్య తీర్పుకు స్వస్తిపలికి కొత్త ఆరంభానికి నాందిపలకాలన్నారు. నమాజు ఎక్కడైన పరిశుభ్రమైన ప్రదేశంలో చేసుకోవచ్చు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు నాణ్యమైన విద్యకోసం పాఠశాలు, కాలేజీలు చాలా అవసరమన్నారు. సుమారు 22 కోట్లమంది ముస్లింలు నాణ్యమైన విద్యను పొందేలేకపోతున్నారని తెలిపారు. విద్యతో చాలా సమస్యలు పరిష్కరించబడుతాయని సలీమ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి కోసం పాటుపతున్నారని.. ఆయన విధానాల్ని అంగీకరిస్తానని తెలిపారు. తమకు(ముస్లిం) శాంతి అవసరమని, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కాగా బాలీవుడ్ గీత రయిచతల్లో సలీమ్-జావేద్ ద్వయం పలు బ్లాక్ బాస్టర్ చిత్రాల పాటలకు సాహిత్యం అందించిన విషయం తెలిసిందే. -
‘సల్మాన్ ఎగ్జామ్స్ అలా పాస్ అయ్యేవాడు’
బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు దబాంగ్ హీరో. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ చదువులో మాత్రం పూర్ స్టూడెంటేనట. ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించుకుని పరీక్షలు పాస్ అయ్యేవారంట. ఈ విషయం గురించి స్వయంగా సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ చెప్పారు. కపిల్ శర్మ షోకు సలీం తన ముగ్గురు కొడుకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకులు బాల్యంలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. ‘సల్మాన్ చిన్నతనంలో మా ఇంటికి గణేష్ అనే వ్యక్తి వచ్చేవాడు. అతను రాగానే నా కొడుకులు గణేష్ కోసం కూర్చి తీసుకురండి.. గణేష్ చాయ్ తాగండి అంటూ నాకంటే ఎక్కువ మర్యాద అతనికే ఇచ్చేవారు. దాంతో అసలు ఈ గణేష్ ఎవరూ.. ఎందుకు నా కొడుకులు అతనికి అంత ప్రధాన్యత ఇస్తున్నారని ఆలోచించగా అసలు విషయం అప్పుడు తెలిసిందే. ఈ గణేష్ అనే వ్యక్తి నా పిల్లల కోసం ఎగ్జామ్ పేపర్లు లీక్ చేయించి తీసుకొచ్చేవాడు. దాంతో నా పిల్లలు అతనికి అంత మర్యాద ఇచ్చేవారని అర్థమయ్యింద’న్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’ సినిమాతో బిజీగా ఉన్నారు. Jab Kapil ke ghar aayi Khan family, dekhiye kiss kiss ki pol khul gayi! #TheKapilSharmaShow, 29 Dec se, har Sat-Sun raat 9:30 baje. @BeingSalmanKhan @SohailKhan @arbaazSkhan @KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @RochelleMRao @trulyedward pic.twitter.com/Aux3E7bXXg — Sony TV (@SonyTV) December 26, 2018 -
సల్మాన్ ఖాన్‌ను కలిసిన కేంద్ర మంత్రి
సాక్షి, ముంబై : ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాంద్రాలోని సల్మాన్ నివాసానికి (గెలాక్సీ) వెళ్లిన గడ్కరీ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించే కరపత్రాలను సలీం ఖాన్‌కు అందజేశారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశానికి నితిన్ గడ్కరీతో పాటు ముంబై బీజేపీ సీనియర్ నేత రాజ్ పురోహిత్ కూడా హాజరయ్యారు. ‘సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా శ్రీ సలీం ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశాను. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చర్చించామంటూ’ సల్మాన్ ఖాన్‌ను కలిసిన సందర్భంగా..నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే గడ్కరీ ట్వీట్‌ను లైక్ చేసిన సల్మాన్, సలీం ఖాన్లు ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాగా ఎన్డీయే పాలనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4 వేల మంది పార్టీ ప్రముఖులు.. వివిధ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులుగా పేరు పొందిన లక్ష మందిని కలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. Met Sri Salim Khan ji & Salman Khan as part of "Sampark For Samarthan" campaign. Have discussed the achievement and initiative of Modi govt in last 4 years . pic.twitter.com/8gBSgNKZ89 — Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2018 -
‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువుతో అరటన్ను (500 కేజీలు) మహిళగా పేరొందిన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(37) బరువు తగ్గే ఆపరేషన్ కోసం గత వారం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా గత 25 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఆమెకు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ల మూవీలు చూస్తానని చెప్పింది. అరటన్ను మహిళ ఎమాన్‌కు సల్మాన్‌ను కలవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట. కండలవీరుడు సల్మాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు వీరాభిమానినని జాతీయ మీడియాతో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ఆమె తన సర్జరీ ముగిసేలోగా సల్మాన్‌ను కలుసుకునే ఏర్పాటు చేయాలని బేరియాట్రిక్ సర్జరీ చేయనున్న డాక్టర్ ముఫజల్ లక్డావాలాను ఆమె కోరినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి అధికారికంగా హీరోకు రిక్వెస్ట్ పంపించారు. సల్మాన్ ఈ విషయంపై ఏవిధంగానూ స్పందించలేదు. ఆయన తండ్రి, సీనియర్ రైటర్ సలీంఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సైఫీ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఆహ్వానం అందితే సల్మాన్ తప్పకుండా అక్కడికి వెళ్లి అభిమాని ఎమాన్‌ను కలుస్తారని చెప్పారు. గత శనివారం ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రత్యేక బెడ్‌పై ముంబై ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
'ఆ దేవుడికి కూడా తెలీదు'
బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ వివాహానికి సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా.. సల్మాన్ తండ్రి, వెటరన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్.. కుమారుడి వివాహంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సల్మాన్ పెళ్లి ఎప్పుడు చేస్కుంటాడనే విషయం తనకే కాదు, ఆ దేవుడికి కూడా తెలీదంటూ సలీమ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన త్వరలో ఓ రేడియో షోను హోస్ట్ చేయనున్నారు. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'ఆ కార్యక్రమంలో మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాను.. సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేస్కుంటున్నాడు అనే ఒక్క ప్రశ్నకు తప్ప. ఎందుకంటే ఆ విషయం నాకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలీదు' అంటూ సలీమ్ చమత్కరించారు. సలీమ్ ఖాన్ లోకల్ ఎఫ్ఎమ్ రేడియోలో 'ది 70ఎమ్ ఎమ్ షో' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయబోతున్నారు. వారాంతరాలలో 2 గంటలపాటు ఆ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 1/2 Whether you are at home or on the move tune into @RadioNasha919 every Sat-Sun 4-5 pm and i will talk to all of you. — Salim Khan (@luvsalimkhan) 13 August 2016 2/2 You may ask me any question except "When is Salman getting married" - even god doesnt know. @KiranKotrial @SohailKhan @BeingSalmanKhan — Salim Khan (@luvsalimkhan) 13 August 2016 -
‘నేను అలాంటి ముస్లింను కాను’
ముంబై: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిని బాలీవుడ్ రచయిత, హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఖండించారు. ఉగ్రవాదులు అమాయకులను చంపడం అమానుషమని ట్వీట్ చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నవారు ముస్లింలని చెబుతున్నారు. ముస్లింగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఖురాన్‌ను అనుసరించాలి. దాడులకు పాల్పడుతున్నవారు దేన్ని పాటిస్తున్నారో తెలియదు కానీ వాళ్లు ఇస్లాంను అనుసరించడం లేదు. దాడులకు పాల్పడుతున్నవాళ్లు ఏ కారణంగా అయినా ముస్లింలు కావచ్చు. నేను అలాంటి ముస్లింను కాను. అమాయకులను చంపడమంటే మానవత్వాన్ని చంపడమే’ అని సలీం ట్వీట్ చేశారు. ఉగ్రవాదులు ఢాకాలోని కేఫ్‌పై దాడిచేసి 20 మందిని అతికిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన తరుషి జైన్ అనే అమ్మాయితో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. -
'రాజ్యసభ సీటు కోసం వెంట పడలేదు'
ముంబై: రాజ్యసభకు ఎంపిక అనేది ఎవరికైనా చాలా గొప్ప విషయమేని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీంఖాన్ పేర్కొన్నారు. అయితే తనకు రాజ్యసభ నామినేటెడ్ సీటు ఎవరు ఆఫర్ చేయలేదని తనపై వస్తున్న వదంతులకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాజ్యసభ సీటు కోసం తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించనేలేదని శనివారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆ వదంతులను ఆయన కొట్టిపారేశారు. బీజేపీ తనకు అవకాశం ఇస్తే తిరస్కరించానంటూ ప్రచారం జరగడంపై సలీంఖాన్ మండిపడ్డారు. తనకు ఒకవేళ అవకాశం కల్పిస్తే చాలా గొప్ప గౌరవంగా భావిస్తానని, అయితే ప్రస్తుతం వయసు దృష్ట్యా కాస్త ఆలోచించాల్సి వస్తుందని గ్రేట్ రైటర్ వివరించారు. జావేద్ అక్తర్-సలీంఖాన్ ధ్వజం షోలే, మిస్టర్ ఇండియా, జంజీర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలకు స్క్రిప్టు అందించారు. Never been offered, if offered its a great honor. But will have to think cause of my age. — Salim Khan (@luvsalimkhan) April 23, 2016 News "Salim Khan snubs BJP by refusing Rajya Sabha" is wrong. — Salim Khan (@luvsalimkhan) April 23, 2016 -
'లవ్.. బ్రేకప్స్ గురించి నన్ను అడగొద్దు'
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా చివరకు విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సయోధ్య కుదరక ఇక కలిసి సాగకూడదని అనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. ఆఖరికి సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మలైకాతో మాట్లాడిన ఆమె అతడి మాటలు వినేందుక ఆసక్తి చూపలేదని తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయించుకొని డైవర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అర్బాజ్ తండ్రి సలీం ఖాన్‌ను ప్రశ్నించగా 'నేనొక రచయితను. బ్రేకప్ ల గురించి, ప్రేమ వ్యవహారాల గురించి నన్ను అడగకండి. నా పిల్లల విషయాల్లో నేనెప్పుడూ తల దూర్చను. నాకు అసలు ఈ విషయంపై మాట్లాడాలని లేదు. మరోపక్క, మలైకా తల్లి జాయ్స్ పోలీకార్ప్ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 'వాళ్లిద్దరు ఎదిగినవారు. అది వారి వ్యక్తిగత వ్యవహారం. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. నాకు మీడియాతో మాట్లాడాలని కూడా లేదు' అని ఆమె చెప్పింది. -
డీజిల్ దొంగ అరెస్ట్
రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకోని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రట్టు చేశారు. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన సలీమ్ ఖాన్(37), జాఖీర్ ఖాన్(35), పప్పు యాదవ్ (20), అనీఫ్ ఖాన్ (25), లతీఫ్ ఖాన్(30)లు నగరానికి వలస వచ్చి శాస్త్రీపురంలో ఉంటు నేరాల బాట పట్టారు. గత కొంత కాలంగా రోడ్లపై ఆగి ఉన్న లారీలలోంచి డిజిల్‌ను దొంగిలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కాగా వీరి దృష్టి కాటేదాన్ పారిశ్రామిక వాడకు వచ్చే లారీలపై పడింది. ఎవరికి అనుమానం రాకుండా స్కార్పియో వాహనంలో తిరుగుతూ గత కొంత కాలంగా రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీల నుంచి డిజిల్ దొంగిలిస్తున్నారు. నిత్యం ఈ కేసులు పోలీసుల దృష్టికి వస్తుండడంతో డిజిల్ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ లారీ నుంచి ముఠా సభ్యులు డిజిల్ చోరీ చేస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 200 లీటర్ల డిజిల్‌తో పాటు ఏపీ 07 ఏబీ 8480 నెంబర్ గల స్కార్పియో వాహనాన్ని స్వాదీనం చేసుకోని సీజ్ చేశారు. -
పద్మ పురస్కారాలకు ప్రముఖుల తిరస్కారం
-
కైసే బనాతే.. సేమియా
సేమియా తయారీలో ఖాన్ బ్రదర్సది ఫిఫ్టీ ఇయర్స ఇండస్ట్రీ. పొడవాటి సన్నని దారం పోగుల్లా కనిపించే సేమియా తయారీకి వారు ఎలాంటి యంత్రాలనూ ఉపయోగించరు. కేవలం హస్తకౌశలంతోనే తయారు చేస్తారు. చాదర్‌ఘాట్ మూసానగర్ ప్రాంతంలోని సలీంఖాన్, ఆయన ఇద్దరు సోదరులు... అన్వర్ ఖాన్, యూసఫ్ ఖాన్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే పనిలో తలమునకలుగా ఉంటారు. రంజాన్ మాసం చివరి రోజైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తయారుచేసే స్వీట్ ‘షీర్ కుర్మా’కు ఈ సేమియానే ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో వీరికి మంచి గిరాకీ. వారి పిల్లలు కూడా స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఈ పనిలో చేదోడు వాదోడుగా ఉంటారు. ఎలా చేస్తారంటే... మైదాలో తగినంత ఉప్పు కలిపి, నీరు చేర్చి ముద్ద కలుపుకుంటారు. రాత్రంతా ముద్దను అలాగే వదిలేస్తారు. ఉదయాన్నే సేమియా తయారీ మొదలుపెడతారు. చకచకగా పోగులుగా తయారుచేసిన సేమియాను దండెంలా కట్టిన దారాలపై ఆరబెడతారు. సేమియా తయారీ ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. అయితే, ఒకసారి దారాలపై ఆరబెట్టాక, పది నిమిషాల్లోనే పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయిన సేమియాను జాగ్రత్తగా తీసి, కట్టలు కట్టలుగా కట్టి ప్యాక్ చేస్తారు. వానొస్తేనే ఇబ్బంది: సలీం ఖాన్: రంజాన్ నెలలోను, ముందు నెలలోను ఈ సేమియాకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. అయితే, తయారీ సమయంలో వానొస్తే మాకు నష్టం తప్పదు. అలాంటప్పుడు ఒక్కోరోజులో రూ.1200-1500 వరకు నష్టం వస్తుంది. పూర్తిగా చేతులతోనే సేమియా తయారు చేయడానికి చాలా నైపుణ్యం, ఓపిక కావాలి. మా నాన్న సర్దార్ ఖాన్ వద్ద నేను, మా తమ్ముళ్లు దీని తయారీని నేర్చుకున్నాం. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఈ సేమియా తయారీని మా తాత ప్రారంభించారు. యాభయ్యేళ్లుగా ఇదే పనిలో కొనసాగుతున్నాం. ప్రస్తుతం రోజుకు దాదాపు ముప్పయి కిలోల సేమియా తయారు చేస్తున్నాం. నగరంలోని దుకాణాలకే కాకుండా, చుట్టుపక్కల జిల్లాలకూ సరఫరా చేస్తున్నాం. - సాక్షి, సిటీప్లస్ -
ఆధార్ సీడింగ్‌ను వేగిరపర్చండి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెలాఖరు నాటికి నూరుశాతం రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆదివారం ఆధార్ అనుసంధానం, అమ్మహస్తం, నిత్యావసర సరుకుల పంపిణీ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అర్హత గల ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానమే మార్గమని చెప్పారు. జిల్లాలో 12 లక్షల తెల్ల రేషన్‌కార్డులకు 33 లక్షల యూనిట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం పూర్తి అయ్యిందన్నారు. మిగిలిన 10 లక్షల యూనిట్ల అనుసంధాన పక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తిచేసేం దుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఆధార్‌కార్డులు అందించాలనే లక్ష్యంతో 46 మండలాల్లో శాశ్వత ఆధార్ కార్డుల జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమ్మహస్తం పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డీలర్లను కోరారు. చౌకడిపో డీలర్లు బాధ్యతాయుతంగా పనిచే యడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామని చె ప్పారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ డీలర్లకు బ్యాం కుల నుంచి రుణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సివిల్ సప్లయిస్ జీఎం సలీంఖాన్, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.