'లవ్.. బ్రేకప్స్ గురించి నన్ను అడగొద్దు'
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా చివరకు విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సయోధ్య కుదరక ఇక కలిసి సాగకూడదని అనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. ఆఖరికి సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మలైకాతో మాట్లాడిన ఆమె అతడి మాటలు వినేందుక ఆసక్తి చూపలేదని తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయించుకొని డైవర్స్ కోరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై అర్బాజ్ తండ్రి సలీం ఖాన్ను ప్రశ్నించగా 'నేనొక రచయితను. బ్రేకప్ ల గురించి, ప్రేమ వ్యవహారాల గురించి నన్ను అడగకండి. నా పిల్లల విషయాల్లో నేనెప్పుడూ తల దూర్చను. నాకు అసలు ఈ విషయంపై మాట్లాడాలని లేదు. మరోపక్క, మలైకా తల్లి జాయ్స్ పోలీకార్ప్ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 'వాళ్లిద్దరు ఎదిగినవారు. అది వారి వ్యక్తిగత వ్యవహారం. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. నాకు మీడియాతో మాట్లాడాలని కూడా లేదు' అని ఆమె చెప్పింది.