‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో! | half ton woman desire to meet Bollywood actor Salman Khan | Sakshi
Sakshi News home page

‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!

Feb 16 2017 8:46 AM | Updated on Sep 5 2017 3:53 AM

‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!

‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!

అరటన్ను ‌(500 కేజీలు) మహిళగా పేరొందిన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్ బరువు తగ్గే ఆపరేషన్ కోసం గత వారం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే.

ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువుతో అరటన్ను ‌(500 కేజీలు) మహిళగా పేరొందిన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(37) బరువు తగ్గే ఆపరేషన్ కోసం గత వారం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా గత 25 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఆమెకు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ల మూవీలు చూస్తానని చెప్పింది. అరటన్ను మహిళ ఎమాన్‌కు సల్మాన్‌ను కలవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట. కండలవీరుడు సల్మాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు వీరాభిమానినని జాతీయ మీడియాతో వెల్లడించింది.

ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ఆమె తన సర్జరీ ముగిసేలోగా సల్మాన్‌ను కలుసుకునే ఏర్పాటు చేయాలని బేరియాట్రిక్ సర్జరీ చేయనున్న డాక్టర్ ముఫజల్ లక్డావాలాను ఆమె కోరినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి అధికారికంగా హీరోకు రిక్వెస్ట్ పంపించారు. సల్మాన్ ఈ విషయంపై ఏవిధంగానూ స్పందించలేదు. ఆయన తండ్రి, సీనియర్ రైటర్ సలీంఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సైఫీ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఆహ్వానం అందితే సల్మాన్ తప్పకుండా అక్కడికి వెళ్లి అభిమాని ఎమాన్‌ను కలుస్తారని చెప్పారు. గత శనివారం ఈజిప్ట్‌ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రత్యేక బెడ్‌పై ముంబై ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement