Eamon Ahmed
-
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
-
భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి!
సాక్షి, ముంబై : ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్‌ను భారత్ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యేవరకూ ఎమాన్‌ను ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పినా కుటుంబసభ్యులు మమ్మల్ని నమ్మలేదని చెప్పారు. ఎమాన్ చనిపోవడాన్ని సైఫీ ఆస్పత్రి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. 20 మంది డాక్టర్ల బృందం ఎమాన్‌కు మెరుగైన సేవలు అందించినా చివరివరకూ ఇక్కడే ఉండకపోవడం ఎమాన్ ప్రాణాల్ని బలితీసుకుందన్నారు. ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ నిన్న (సోమవారం) అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపోయారు. అధిక బరువుతో సతమతమవుతున్న 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఆమె మృతికి ప్రధాన కారణాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం గత ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఆమె బేరియాట్రిక్ సర్జరీతో దాదాపు 330 కిలోల బరువు తగ్గారు. చికిత్స పూర్తికాకముందే ఆమె సోదరి షైమా సెలీమ్ మే నెలలో యూఏఈకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమాన్ దురృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయి వార్తల్లో నిలిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమాన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
ప్రపంచ భారీకాయురాలు ఎమాన్ మృతి
అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ కన్నుమూసింది. ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ సోమవారం అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్య లతో మృతి చెందినట్లు వెల్లడించారు. బరువు తగ్గించుకునేందుకు ఈజిప్ట్ నుంచి గత ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చిన ఆమె.. వివాదాస్పద పరిస్థితుల్లో చికిత్స కోసం యూఏఈకి వెళ్లిన విషయం తెలిసిందే. 500 కిలోలకు పైగా బరువుతో ముంబై వచ్చిన ఎమాన్‌కు సైఫీ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె 323 కిలోల బరువు తగ్గింది. అయితే సైఫీ ఆస్పత్రిలో ఎమాన్‌కు సరైన చికిత్స అందలేదని ఆమె సోదరి షైమా సెలీమ్ ఆరోపించడంతో వివాదం మొదలైంది. అనంతరం సరైన చికిత్స కోసం ఎమాన్‌ను అబుదాబికి తరలించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి. -
‘భారీ మహిళ’ వద్దకు బాలీవుడ్ హీరో!
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువుతో అరటన్ను (500 కేజీలు) మహిళగా పేరొందిన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(37) బరువు తగ్గే ఆపరేషన్ కోసం గత వారం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా గత 25 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఆమెకు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ల మూవీలు చూస్తానని చెప్పింది. అరటన్ను మహిళ ఎమాన్‌కు సల్మాన్‌ను కలవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట. కండలవీరుడు సల్మాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు వీరాభిమానినని జాతీయ మీడియాతో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ఆమె తన సర్జరీ ముగిసేలోగా సల్మాన్‌ను కలుసుకునే ఏర్పాటు చేయాలని బేరియాట్రిక్ సర్జరీ చేయనున్న డాక్టర్ ముఫజల్ లక్డావాలాను ఆమె కోరినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి అధికారికంగా హీరోకు రిక్వెస్ట్ పంపించారు. సల్మాన్ ఈ విషయంపై ఏవిధంగానూ స్పందించలేదు. ఆయన తండ్రి, సీనియర్ రైటర్ సలీంఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సైఫీ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఆహ్వానం అందితే సల్మాన్ తప్పకుండా అక్కడికి వెళ్లి అభిమాని ఎమాన్‌ను కలుస్తారని చెప్పారు. గత శనివారం ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రత్యేక బెడ్‌పై ముంబై ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
ముంబై చేరుకున్న ‘భారీ మహిళ’
క్రేన్ సాయంతో విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి తరలింపు ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళల్లో ఒకరైన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(500 కేజీలు) బరువు తగ్గే ఆపరేషన్ కోసం శనివారం ముంబైకి చేరుకుంది. ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానంలో ప్రత్యేక బెడ్‌పై తీసుకొచ్చిన ఆమెను... ముంబై విమానాశ్రయం నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించేందుకు క్రేన్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్‌లోకి క్రేన్ యంతో ఆమెను ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఆ ట్రక్‌ను అంబులెన్సు, పోలీస్ వాహనాలు అనుసరించాయి. కాగా, ఆస్పత్రిలో ఎమాన్ సం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అధిక బరువు కారణంగా ఎమాన్ గత 25 ఏళ్లుగా కైరోలోని తన ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదని చెప్పారు. నెలరోజుల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చేస్తామన్నారు. గత 25 ఏళ్లుగా ఎక్కడికీ కదలకపోవడం, పల్మొనరీ ఎంబాలిజంతో తీవ్రంగా బాధపడుతుండటంతో ఎమాన్ తరలించడం కోసం శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. ఆమెను ఇంటి నుంచి బయటికి తీసుకురావడానికి గది గోడలను బద్దలుకొట్టారు. ఈజిప్ట్ కు చెందిన విమానంలో బెడ్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే తగిన చికిత్స అందించేందుకు వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు తదితరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమాన్ ప్రస్తుతం సర్జరీ నిఫుణుల పర్యవేక్షణలో ఉంది.