అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ కన్నుమూసింది. ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ సోమవారం అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 37 ఏళ్ల ఎమాన్.. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్య లతో మృతి చెందినట్లు వెల్లడించారు. బరువు తగ్గించుకునేందుకు ఈజిప్ట్ నుంచి గత ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చిన ఆమె.. వివాదాస్పద పరిస్థితుల్లో చికిత్స కోసం యూఏఈకి వెళ్లిన విషయం తెలిసిందే.
500 కిలోలకు పైగా బరువుతో ముంబై వచ్చిన ఎమాన్‌కు సైఫీ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె 323 కిలోల బరువు తగ్గింది. అయితే సైఫీ ఆస్పత్రిలో ఎమాన్‌కు సరైన చికిత్స అందలేదని ఆమె సోదరి షైమా సెలీమ్ ఆరోపించడంతో వివాదం మొదలైంది. అనంతరం సరైన చికిత్స కోసం ఎమాన్‌ను అబుదాబికి తరలించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యాలో మంగళవారం ఎమాన్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రపంచ భారీకాయురాలు ఎమాన్ మృతి
Published Tue, Sep 26 2017 2:58 AM | Last Updated on Tue, Sep 26 2017 7:30 AM
Advertisement