సలీం ఖాన్‌కు కరపత్రాలు అందజేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(ట్విటర్ ఫొటో)
సాక్షి, ముంబై : ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాంద్రాలోని సల్మాన్ నివాసానికి (గెలాక్సీ) వెళ్లిన గడ్కరీ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించే కరపత్రాలను సలీం ఖాన్‌కు అందజేశారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశానికి నితిన్ గడ్కరీతో పాటు ముంబై బీజేపీ సీనియర్ నేత రాజ్ పురోహిత్ కూడా హాజరయ్యారు.
‘సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా శ్రీ సలీం ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశాను. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చర్చించామంటూ’ సల్మాన్ ఖాన్‌ను కలిసిన సందర్భంగా..నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే గడ్కరీ ట్వీట్‌ను లైక్ చేసిన సల్మాన్, సలీం ఖాన్‌లు ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాగా ఎన్డీయే పాలనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4 వేల మంది పార్టీ ప్రముఖులు.. వివిధ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులుగా పేరు పొందిన లక్ష మందిని కలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Met Sri Salim Khan ji & Salman Khan as part of "Sampark For Samarthan" campaign. Have discussed the achievement and initiative of Modi govt in last 4 years . pic.twitter.com/8gBSgNKZ89
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2018
Comments
Please login to add a commentAdd a comment