'రాజ్యసభ సీటు కోసం వెంట పడలేదు'
ముంబై: రాజ్యసభకు ఎంపిక అనేది ఎవరికైనా చాలా గొప్ప విషయమేని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీంఖాన్ పేర్కొన్నారు. అయితే తనకు రాజ్యసభ నామినేటెడ్ సీటు ఎవరు ఆఫర్ చేయలేదని తనపై వస్తున్న వదంతులకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాజ్యసభ సీటు కోసం తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించనేలేదని శనివారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆ వదంతులను ఆయన కొట్టిపారేశారు.
బీజేపీ తనకు అవకాశం ఇస్తే తిరస్కరించానంటూ ప్రచారం జరగడంపై సలీంఖాన్ మండిపడ్డారు. తనకు ఒకవేళ అవకాశం కల్పిస్తే చాలా గొప్ప గౌరవంగా భావిస్తానని, అయితే ప్రస్తుతం వయసు దృష్ట్యా కాస్త ఆలోచించాల్సి వస్తుందని గ్రేట్ రైటర్ వివరించారు. జావేద్ అక్తర్-సలీంఖాన్ ధ్వజం షోలే, మిస్టర్ ఇండియా, జంజీర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలకు స్క్రిప్టు అందించారు.
Never been offered, if offered its a great honor. But will have to think cause of my age.
— Salim Khan (@luvsalimkhan) April 23, 2016
News "Salim Khan snubs BJP by refusing Rajya Sabha" is wrong.
— Salim Khan (@luvsalimkhan) April 23, 2016