Rajya sabha seat
-
Big Question: రాజ్యసభకు అవినీతి తిమింగలం.. నారా లోకేష్ భారీ స్కెచ్
-
Congress: షర్మిలకు మొండి చెయ్యి
అంతన్నారు ఇంతన్నారు.. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో బాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు.. చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది. అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉందని అన్నారు.. కానీ చివరకు ఏం జరిగింది. దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఈనెల 15 తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువుంది. కానీ ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున షర్మిలకు టిక్కెట్ అయితే దక్కలేదు. ఒకనాడు యావద్దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడక్కడా మిణుకుమిణుకుమంటూ వెలుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో మాత్రం అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటిచోట్ల చెప్పుకోదగ్గ సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ పది వరకు సీట్లు కాంగ్రెసుకు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. ఐతే ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు ఇంకేం లేదని అంటున్నారు. ఆమెను కేవలం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద విమర్శలు.. నిరాధార ఆరోపణలు చేయడం కోసమే వాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదు అని.. ఆమె అటు చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం ఆంధ్రాలో గౌరవాన్ని పోగొట్టుకోవడం మినహా ఆమెకు రాజకీయ కెరీర్ ఉండదు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pawan Kalyan: అనువుగాని చోట..! -
ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ నేత లక్ష్మణ్ కు బీజేపీ రాజ్యసభ సీటు
-
‘దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఓడిపోయే రాజ్యసభ సీటును దళితులకు కేటాయించిన బాబుది ప్రేమో, పగో అర్థం కావడం లేదన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... 2008లో గెలిచే అవకాశం ఉన్నా దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని తెలిపారు. 2016లో పుష్పరాజును సైతం మోసం చేశారన్నారు. మోతుపల్లికి గవర్నర్ పదవి ఇస్తానని మాట తప్పారని ఎద్దేవా చేశారు. గెలిచే రోజుల్లో అవకాశాలివ్వక ఓడిపోయే సమయంలో అవకాశం ఇచ్చి దళితులను బలిపశువులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచే పదవి అయితే కొడుక్కే ఇచ్చేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చంద్రబాబు పన్నాగంతోనే నాపై దాడి: నందిగం సురేష్) ‘దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలను ఎప్పుడూ ఓటుబ్యాంకుగానే చూశారు. గతంలో ఎస్సీలుగా ఎవరు పుడతారు? అన్న ఆయనకు నేడు వారిపై వింత ప్రేమ పుట్టుకొచ్చింది. గెలవని సీటు కోసం మీడియా సమావేశాలు పెడుతున్నారు. దళితులను మోసం చేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక న్యాయం అంటూ తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నారు. దళితులకు గౌరవం లేని పార్టీ టీడీపీ. అవమానాలు దళితులకు.. పదవులు వారి సామాజిక వర్గానికి. టీడీపీలో దళితులు ఏం సాధించారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీరు బలిపశువులు కావద్దు. చంద్రబాబును ప్రశ్నించండి. మనస్సాక్షి, ఆత్మాభిమానాన్ని చంపుకుని టీడీపీలో ఉండలేకే డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాబుకు ఇన్నేళ్లు వచ్చినా అబద్ధాలు, మోసాలు ఆపడం లేదు. ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని నందిగం సురేష్ పేర్కొన్నారు. (వలసల జోరు.. టీడీపీ బేజారు) -
బీజేపీలో వింత పరిస్థితి
లక్నో: కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాజీనామాతో ఖాళీ అయిన పెద్దలసభ సీటును బీజేపీలో ఎవరూ ఆశించకపోవడం వెనుక మరో కారణం ఉంది. పరీకర్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ తన సేవలు అవసరం పడటంతో ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఆశావహుల నిరాసక్తత పార్టీలో ఏదైనా పదవి ఖాళీగా ఉందంటే ఆశావహులు భారీగా పైరవీలకు దిగుతుంటారు. కానీ పరీకర్ వదిలివెళ్లిన రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకురావడం విస్తుగొల్పుతుంది. ఈ సీటుకు గడువు 2020, నవంబర్ వరకు ఉంది. రెండున్నరేళ్లలో గడువు ముగియనుండటంతో దీనిపై బీజేపీ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. పూర్తికాలం కొనసాగే పదవులు చేపట్టే అవకాశముండగా స్వల్పకాలిక పోస్ట్ ఎందుకున్న భావనతో ఆశావహులు ఉన్నట్టు కనబడుతోంది. ఎనిమిది సీట్లపైనే గురి ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న శాసనసభలో కమలదళం బలం 325కు పెరగడంతో రాష్ట్రంలో 8 రాజ్యసభ సీట్లు ఈ పార్టీకి దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఆరు మాసాలు ఓపిక పడితే ఆరేళ్ల పదవి సొంతమవుతుందన్న భావనతో పరీకర్ సీటును ఎవరూ ఆశించడం లేదు. ‘రెండేళ్ల రాజ్యసభ సీటు పట్ల ఆశావహులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న యూపీలోని పది రాజ్యసభ సీట్ల కోసమే పైరవీలు చేస్తున్నార’ని బీజేపీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అల్ఫోన్స్‌కు ఛాన్స్ అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ తోసిపుచ్చారు. ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ పార్లమెంటరీ సెంట్రల్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. పరీకర్ సీటు కోసం తమ పార్టీ నేతలు ఎందుకు పైరవీలు చేయడం లేదనే దానికి కారణం లేదన్నారు. ఈ సీటును కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కె. అల్ఫోన్స్‌కు కేటాయించే అవకాశముందని లక్నో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నిక జరగనున్న ఈ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. పదో సీటు ఎవరిదో..? యూపీలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న 10 రాజ్యసభ సీట్లలో బీజేపీ సొంత బలంతో కనీసం ఎనిమిదింటిని దక్కించుకుంటుంది. 47 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశముంది. పదో సీటును ప్రతిపక్షాలు దక్కించుకోవాలంటే సమాజ్‌వాదీ పార్టీకి బీఎస్పీ(19), కాంగ్రెస్(7), ఆర్ఎల్డీ(1) మద్దతు అవసరమవుతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 37 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం. -
అంత అమాయకుడినా: వెంకయ్య
రాజ్యసభ సీటు కోసం బాబును అడుగుతానా? సాక్షి, విజయవాడ/అమరావతి: ‘1978లో రాష్ట్రంలో ఇందిరాగాంధీ అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో నెల్లూరు జిల్లాలో నేనొక్కడినే బీజేపీ నుంచి గెలుపొందాను. ఓ జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నేను రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అడుగుతానా? అంత అమాయకుడినా?’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన వెంకయ్యను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని 1985లోనే నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ‘ఒకప్పుడు వాజ్‌పేయి, అద్వానీలకు మైక్ పట్టుకున్న నేను బీజేపీ అధ్యక్షుడినయ్యాను. వారి మధ్యే కూర్చునే స్థాయికి ఎదిగాను. రాష్ట్రం నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ కేంద్ర మంత్రుల కోసం ఎవరైనా వస్తే నా వద్దకే మంత్రులను పిలిపించి పనులు చేసి పంపిస్తున్నాను. విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజ్యసభలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో అందరికీ తెలుసు. దాని వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలిగిందో కూడా తెలుసు’ అని అన్నారు. తాను, చంద్రబాబు కష్టపడి పైకి వచ్చామన్నారు. దేశంలో రైతులకు ఆర్థిక పరపతి కల్పించేందుకు రూ.9 లక్షల కోట్ల రుణాలు ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చుతామని ప్రకటించారు. అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధిని కేంద్రీకృతం చేయొద్దని సూచించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలను కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత ఉన్న నేత వెంకయ్యనాయుడు అని కొనియాడారు. -
నీదా..నాదా!
జెడ్పీ పీఠం ► టీడీపీలో మరో వివాదం ► తెరపైకి జెడ్పీ చైర్మన్ పదవి ఒప్పందం ► నేతలను కలుస్తున్న వైస్ చైర్పర్సన్ పుష్పావతి ► అటువంటి ఒప్పందం లేదంటున్న జెడ్పీ చైర్మన్ ► తాను ఖర్చు చేసిన మొత్తం వాపస్ ఇస్తే ఇస్తానని కొత్త మెలిక సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో మరో లొల్లి తెరమీదకు వచ్చింది. రాజ్యసభ సీటు విషయంలో రేగిన రగడ కాస్తా చల్లారకముందే... జెడ్పీ చైర్మన్ పీఠంపై చర్చ మొదలయ్యింది. మొదట్లో చేసుకున్న ఒప్పందం మేరకు తనకు రెండేళ్ల తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలని నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలిసింది. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌లను కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు అటువంటి ఒప్పందమేదీ లేదని ప్రస్తుత జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తన అనుచరుల వద్ద వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే... తాను ఖర్చు పెట్టిన డబ్బులను ఇస్తే పదవిని ఇప్పుడే వదులుకుంటానని రాజశేఖర్ అంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కుదిరిన ఒప్పందం మేరకు ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదని వైస్ చైర్మన్ వర్గీయులు వాదిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో మరో పదవి లొల్లి షురూ అయ్యిందన్నమాట. జూలై 7 డెడ్‌లైన్ జిల్లాలో అధికార పార్టీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదు. అయినప్పటికీ పదవులు, డబ్బు ఆశచూపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ పార్టీ మారి ఏకంగా చైర్మన్ పీఠాన్ని రాజశేఖర్ దక్కించుకున్నారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీలో అసంతృప్తి రాజుకుంది. నేరుగా పార్టీ టికెట్లపై గెలిచిన తమను కాదని... వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి ఎలా ఇస్తారని వాదించారు. అయితే, ప్రస్తుతం కేవలం రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే ఆయన జెడ్పీ చైర్మన్‌గా ఉంటారని పార్టీ నేతలు బుజ్జగించారు. రెండేళ్ల తర్వాత మిగిలిన మూడేళ్ల కాలానికి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తామని వైస్ చైర్మన్‌గా ఉన్న పుష్పావతికి పార్టీ నేతలు అప్పట్లో హామీనిచ్చారని ఈమె వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం మేరకు జూలై 7తో రెండేళ్ల కాలపరిమితి ముగియనున్నందున... జూలై 8 నుంచి తనకు పీఠం అప్పగించాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ కలుస్తున్నట్టు తెలిసింది. -
'రాజ్యసభ సీటు కోసం వెంట పడలేదు'
ముంబై: రాజ్యసభకు ఎంపిక అనేది ఎవరికైనా చాలా గొప్ప విషయమేని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీంఖాన్ పేర్కొన్నారు. అయితే తనకు రాజ్యసభ నామినేటెడ్ సీటు ఎవరు ఆఫర్ చేయలేదని తనపై వస్తున్న వదంతులకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాజ్యసభ సీటు కోసం తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించనేలేదని శనివారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆ వదంతులను ఆయన కొట్టిపారేశారు. బీజేపీ తనకు అవకాశం ఇస్తే తిరస్కరించానంటూ ప్రచారం జరగడంపై సలీంఖాన్ మండిపడ్డారు. తనకు ఒకవేళ అవకాశం కల్పిస్తే చాలా గొప్ప గౌరవంగా భావిస్తానని, అయితే ప్రస్తుతం వయసు దృష్ట్యా కాస్త ఆలోచించాల్సి వస్తుందని గ్రేట్ రైటర్ వివరించారు. జావేద్ అక్తర్-సలీంఖాన్ ధ్వజం షోలే, మిస్టర్ ఇండియా, జంజీర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలకు స్క్రిప్టు అందించారు. Never been offered, if offered its a great honor. But will have to think cause of my age. — Salim Khan (@luvsalimkhan) April 23, 2016 News "Salim Khan snubs BJP by refusing Rajya Sabha" is wrong. — Salim Khan (@luvsalimkhan) April 23, 2016 -
త్రీఎస్సార్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సుబ్బరామిరెడ్డిని ముచ్చటగా మూడోసారి రాజ్యసభ సీటు వరించింది. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరులో పుట్టిపెరిగి, హైదరాబాద్‌లో వ్యాపారాలు చే సే ఆయన విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ పర్యాయం రాజ్యసభ కాకుండా విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని రెండేళ్ల ముందు నుంచే హడావుడి చేసిన ఆయన చివరకు పార్టీ అధిష్టానం నిర్ణయించిన విధంగా రాజ్యసభ బరిలో నిలవాల్సి వచ్చింది. గతంలో 1996, 98 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన 1999లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2002లో, 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి విశాఖ లోక్‌సభపైనే దృష్టి సారించి ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి పురందేశ్వరికి పోటీగా గ్రూపు రాజకీయాలు చేస్తూ వచ్చారు. విశాఖలో సేవా కార్యక్రమాలను కూడా బాగా విస్తరించారు. ఇటీవలే కేజీహెచ్‌లో రోగుల సహాయకుల సౌకర్యార్థం సత్రాన్ని నిర్మించారు. -
పెద్దల సీటు కోసం ‘తమ్ముళ్ల’ పోరు
అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లో అసంతృప్తి కోటరీకే పీట వేస్తున్నారని.. డబ్బే కొలమానంగా మారిందని ఆగ్రహం టికెట్ కోసం గరికపాటి యత్నాలు.. అడ్డుకునేందుకు సుజనా వ్యూహం బాలకృష్ణను రాజ్యసభకు పంపించే ఎత్తుగడలో చంద్రబాబునాయుడు బాలయ్యను పార్టీకి దూరంగా ఉంచి.. ప్రచారానికే వాడుకునే ఎత్తుగడ! రాజ్యసభపై హామీ లభించకపోవటంతో మోత్కుపల్లి అసంతృప్తి గళం మరోసారి సీటు ఆశిస్తున్న కంభంపాటి.. ‘రాజగురువు’ ద్వారా సిఫారసు! రేసులో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు వ్యాపార ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్తెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న నేతలు ఈసారి ఎలాగైనా రాజ్యసభ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ఒక నేత రాష్ట్ర రాజధానిలోని ఒక స్టార్ హోటల్లో విందు మంత్రాంగం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం రాజ్యసభకూ వర్తింపచేస్తుండటం ఆ నేతకు తలనొప్పిగా తయారైంది. మరోవైపు చంద్రబాబు తన సన్నిహితులకు, డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిసారీ డబ్బు కొలమానంగా మారిందని, ఈసారీ అలాంటి అభ్యర్థులే ఎంపికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా ప్రతిసారీ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, చంద్రబాబు కోటరీలో ఒకరికి టికెట్ ఇస్తున్నారని పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ ఎన్నో విధాలుగా నష్టపోయిన వారికి గుర్తింపు ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలఢీ అంటే ఢీ టీడీపీ రాజకీయాలను శాసిస్తూ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఇద్దరు పారిశ్రామికవేత్తలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఒకరికొకరు ఢీఅంటే ఢీ అనే పరిస్థితికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తుంటే.. ఆయనకు టికెట్ రాకుండా చేయాలని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గరికపాటిని రాజ్యసభకు ఎంపిక చేస్తే పార్టీలో, ఢిల్లీలో తన ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన భావనగా చెప్తున్నారు. గరికపాటికి చెక్ పెట్టేందుకే రాజ్యసభకు బాలకృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు ఖరారయ్యాయని సుజనాచౌదరికి చెందిన టీవీ చానెల్లో విస్తృత ప్రచారం చేస్తుండటం విశేషం. బాలకృష్ణను తెరపైకి తెచ్చిన బాబు... మరోవైపు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ మీద పట్టు సాధించుకోవాలని భావిస్తున్న నందమూరి బాలకృష్ణను ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం నేరుగా బాలకృష్ణకు చెప్తే అంగీకరించే అవకాశం లేనందున ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించాలంటూ పార్టీ నేతల ద్వారా డిమాండ్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే తన సన్నిహితుడి టీవీ చానల్లో బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఖరారైందనే వార్తలను ప్రసారం చేయించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్యసభకు పంపడం ద్వారా పార్టీలో బాలకృష్ణ జోక్యం ఉండకుండా దూరం చేయడం, ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవడం వరకు పరిమితం చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అసంతృప్తి గళమిప్పిన మోత్కుపల్లి రాజ్యసభ టికెట్ విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అసంతృప్తి గళం విప్పారు. గరికపాటి మోహనరావుకు టిక్కెట్టు దాదాపు ఖరారైందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు బిల్యానాయక్‌తో పాటు పలువురు నేతలతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించి సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత మోత్కుపల్లి తరఫున ఆ నాయకులు చంద్రబాబును కలిశారు. నల్గొండ జిల్లా నేతలు చాలా మంది వెళ్లినా ఉమా మాధవరెడ్డి, వేనేపల్లి చందర్రావు మాత్రం రాలేదు. రేసులో చాలా మందే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ (బాబ్జీ), నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాల క్ష్మి టీడీపీ నుంచి రాజ్యసభకు టికెట్ కోసం పోటీపడుతున్నారు. పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కూడా రాజ్యసభ టికెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఎంపీగా పనిచేసి మరోసారి సీటు ఆశిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావు జాతీయ పార్టీల నేతలతో పాటు పార్టీకి రాజగురువుగా ఉన్న ఒక పత్రికాధిపతి ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో కరీంనగర్ జిల్లాకు రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులేవీ ఇవ్వలేదని, ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం కల్పించాలని ఆ జిల్లా పార్టీ నాయకురాలు గండ్ర నళిని ఇటీవలే చంద్రబాబును కలసి వివరించారు. అలాగే విశాఖపట్నం మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కోసం మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య, మాజీ ఎంపీ కిమిడి కళావెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు కావలి ప్రతిభాభారతి, జె.ఆర్.పుష్పరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.షరీఫ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీద రవిచంద్రయాదవ్, పంచుమర్తి అనూరాధ, ఎం.అరవిందకుమార్‌గౌడ్ పేర్లను చంద్రబాబు పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
రాజ్యసభకు బొత్స?
హైకమాండ్ వద్ద లాబీయింగ్ సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టాన పెద్దలందరినీ కలిసి తనను ఈ సారి రాజ్యసభకు పంపాలని కూడా కోరినట్లు తెలిసింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన బొత్స.. పనిలోపనిగా తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని యువనేత రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ ఇన్చార్జీ గులాం నబీ ఆజాద్‌లకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభ జన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడినందున రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనలో ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు. మొన్నటి వరకు విజయనగరం జిల్లా అంతటా బొత్స ప్రభావం చూపారు. కానీ, విభజన పరిణామాలతోపాటు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన ప్రతిష్టను మరింత పలుచన చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మేలని భావించిన బొత్స.. రాజ్యసభ సీటును దక్కించుకునే పనిలో పడ్డట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొందరు విలేకరులు బొత్స వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా కొట్టిపారేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా అన్నారు. అయితే, గత ఏడాది జైపూర్‌లో నిర్వహించిన ఏఐసీసీ సదస్సులో పీసీసీ, డీసీసీ అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నియమావళిని పార్టీ రూపొందించింది. వచ్చే ఎన్నికల నుంచే దానిని అమలు చేస్తామని కూడా పేర్కొంది. ఆ నియమావళిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న బొత్స.. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో పూర్తిగా పార్టీ తరపున రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానని, ప్రతిఫలంగా తనను రాజ్యసభకు పంపాలని హైకమాండ్ పెద్దలవద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.