ద్వారక: కాంగ్రెస్ పార్టీలోని కౌరవుల జాబితా తయారు చేయాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ గుజరాత్ పార్టీ శ్రేణులను కోరారు. ఏసీ కార్యాలయాల్లో కూర్చుని ఏపనీ చేయకుండా ఇతరులను ఇబ్బంది పెట్టే అటువంటి నాయకులు, చివరికి బీజేపీ పంచన చేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి కౌరవులను వదిలించుకోవాలని సూచించారు. ద్వారకలో మూడు రోజులపాటు జరిగే పార్టీ చింతన్ శిబిర్‌లో నేతలు, ఆఫీస్ బేరర్లనుద్దేశించి రాహుల్ మాట్లాడారు.
బీజేపీ రాజకీయాల కారణంగా గుజరాత్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. అధికారం అప్పగిస్తే ఏం చేయనుందనే విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర విభాగాలైన సీబీఐ, ఈడీలతోపాటు మీడియా, పోలీస్ వ్యవస్థలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని దుయ్యబట్టారు.
చదవండి: (కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment